Lucky Zodiac Sign | త్వరలోనే 2026 సంవత్సరం మొదలుకానున్నది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతిలో కొత్త సంవత్సరంలో రెండుసార్లు తన రాశులను మార్చుకోబోతున్నాడు. బృహస్పతి జ్ఞానం, సంపద, ఆధ్యాత్మికత, వివాహానికి సంబంధించిన కారకం. బృహస్పతి తన ఉచ్ఛస్థితి రాశి కర్కాటకంలో సంచరిస్తాడు. ఈ రాశిలో గురువు బలంగా ఉంటాడు. అలాగే, సింహరాశిలోనూ ప్రవేశిస్తాడు. ఈ రెండు రాశిచక్ర మార్పులు పలువురి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇది గౌరవం, ప్రతిష్ట, పెరిగిన ఆదాయం పెరుగుతుంది. పలు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి వారికి 2026లో బృహస్పతి సంచారం చాలా ప్రయోజనంగా ఉంటుంది. బృహస్పతి లగ్నం, తొలి ఇంట్లో సంచరిస్తాడు. దాంతో మీరు ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి శుభప్రదంగా ఉంటుంది. కెరీర్, వ్యాపారానికి సంబంధించిన సానుకూల వార్తలను వింటారు. ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటారు.
2026లో బృహస్పతి సంచారం కన్యారాశి వారికి చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి సంచారం మీ రాశి 12వ ఇంట్లో జరుగనున్నది. దాంతో రాబోయే సంవత్సరంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు మీ దరి చేరుతాయి. ఈ సమయంలో ఓ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు గణనీయమైన లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి.
బృహస్పతి సంచారం తులరాశి వారికి సైతం అద్భుతంగా ఉంటుంది. మీకు అన్ని విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. మీ రాశి, పని, ఆదాయానికి సంబంధించి ఇంట్లో సంచరించనున్నాడు. దాంతో మీ ఆదాయం గణనీయంగా మెరుగుపడుతుంది. మీ కెరీర్, వ్యాపారంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. కొత్త సంవత్సరంలో కొత్ వ్యాపారాలు ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది.