న్యూఢిల్లీ, మార్చి 10: భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఇతర సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐలపై నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేర కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే దేశంలో అన్ని గ్రామాలకు నల్లా కనెక్షన్ అందించటం కోసం ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ గడువును కేంద్రం డిసెంబర్ 2028 వరకు పొడిగించింది.