నాతో కాదు…రేవంత్‌రెడ్డికి చెప్పు
‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే.. తప్పని నాకు చెప్పే బదులు, ఇట్లాంటి పద్ధతి తప్పని పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు.
- పీసీసీ చీఫ్‌కు రాజగోపాల్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- మీనాక్షి నటరాజన్‌కు చెప్పినా ఇబ్బందేమీ లేదు..
- ఆయన మంత్రివర్గంలో ఉన్నోళ్లలో ఎంత మంది కాంగ్రెసోళ్లు?
- పేరు ప్రస్తావించనంటూనే సీఎంపైన సెటైర్లు
- బయటి పార్టీల నుంచి వచ్చినోళ్లు పెత్తనం చేస్తానంటే ఊరుకునేది లేదు
- రవీంద్రభారతిలో మాట్లాడిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నా..
- పార్టీ బాగు కోసమే మాట్లాడుతున్న..
- మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఫైర్
నల్లగొండ ప్రతినిధి, ఆగష్టు 15 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే.. తప్పని నాకు చెప్పే బదులు, ఇట్లాంటి పద్ధతి తప్పని పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. గురువారం రవీంధ్రభారతిలో మాట్లాడిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నానంటూ మరోసారి రెట్టించారు.
‘నేనేం తప్పు మాట్లాడటం లేదు. పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు చెప్పినా భయపడేది లేదు. చెప్పుకోండి’ అంటూ సవాలు చేస్తున్నట్లుగానే స్పందించారు. శుక్రవారం రాత్రి మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పలు టీవీ ఛానళ్లతో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ఇందులో ఏ మాత్రం తాను వెనక్కి తగ్గది లేదని చెప్పకనే చెప్పారు. మరింత రెట్టిస్తూ… ‘నెంబర్ వన్ పోజిషన్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిది కూడా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ ఉద్యమకారుడా?’ అని పరోక్షంగా ఏకిపారేసారు.
‘ప్రభుత్వంలో నెంబర్ వన్ పోజిషన్లో ఉన్నాయన నుంచి మొదలుపెడితే… ఆయన మంత్రివర్గంలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎంత మంది ఉద్యమకారులు ఉన్నారో… ప్రజలకు, తెలుసు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఉద్యమకారులను గౌరవించాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఇందులో తప్పేముంది?’ అని ఎదురు దాడికి దిగారు. ‘కాంగ్రెస్‌కు 65 ఎమ్మెల్యేలు ఉన్నరు. పక్కన ఎంఐఎం వాళ్లు ఉన్నరు. సీపీఐ ఉన్నది. ఇక బీఆర్ఎస్ వాళ్లను ఎందుకు తీసుకున్నట్లు’ అని ఫైరయ్యారు. ‘పోచారం స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు. అట్లాంటి ‘పోచారం’ను ఏట్లా చేర్చుకుంటారు? వచ్చిన ఆయనకు బుద్ధి లేకపోవచ్చు. తీసుకున్నాయకైనా బుద్ధి ఉండాలి కదా?’అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

