సూర్యాపేట, ఆగస్టు 15: సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీ య జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గాంధీజీ సారథ్యంలో భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శనంగా నిలిచిందన్నారు.
ఆ త్యాగధనులను స్ఫూర్గి తీసుకొని వారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో బాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. దేవాదుల పేజ్-6ను ప్రభుత్వం పూర్తి చేసి తుంగతుర్తికి గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. ప్రస్తు త వర్షాలు, జలశయాల్లో నీటి నిల్వను దృష్టిలో ఉంచుకొని తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాగార్జునసాగర్ ఎస్సారెస్పీ స్టేజ్ 2, మూసీ తదితర వ్యవస్థల్లో నీటి లభ్యతను నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. హుజూర్‌నగర్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 21,760 గృహాలను పూర్తి చేసి మౌలిక వసతులు సమకూర్చే పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.
సూర్యాపేట జిల్లాకు 3.71 లక్షలకుపైగా రేషన్‌కార్డులు పంపణీ చేస్తామన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మనమంతా భాగస్వాములవుదామన్నారు. ఎంపీపీఎస్ ఎర్రపహాడ్, శ్రీ హరిత హై స్కూల్ సూర్యాపేట, పీఎం శ్రీ జిఎంఎస్ అనాజిపురం, పీఎం శ్రీ జడ్పీహెచెస్ బాయ్స్ సూర్యాపేట, శ్లోక స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు గుడిపాటి అంజయ్య, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, కుక్కడపు జానకిరామయ్య, గరిడేపల్లికి చెందిన బండ పుల్లారెడ్డిలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్వో ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈవో శిరీష, డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, ఆర్డీవో వేణు మాదవ్, డీఈవో అశోక్, ఇన్చార్జి పరిపాలన అధికారి శ్రీలత పాల్గొన్నారు.