మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 15 : ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై జెం డా ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. దేశంలో ఇప్పటివరకు చాలా వర్గాల ప్రజలు చట్టసభలో అడుగు పెట్టలేదని వారంతా అడుగుపెట్టిన రోజే అన్ని వర్గాలకు ఉపయోగపడే చట్టాలువస్తాయన్నారు.
అంటరానితనం, మహిళలపై లైంగికదాడులు, కుల విభేదాలు, విద్వేశాలు కనిపిస్తున్నాయని వాటిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా ముందుకు వెళాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం రాజ్యాధికారంలో సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు శివరాజ్ నాయకులు ఆంజనేయులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.