Venus Transit | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడిని రాక్షసుల గురువుగా పేర్కొంటారు. ఈ గ్రహం చాలా శక్తివంతమైన శుభగ్రహం. ఓ వ్యక్తి జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ప్రేమ, విలాసాలకు కారకంగా పేర్కొంటారు. శుక్రుడు ఎప్పటికప్పుడు ఒక రాశి, మరో రాశి.. ఒక నక్షత్రం నుంచి మరోనక్షత్రంలోకి సంచరిస్తుంటాడు. ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండగా.. డిసెంబర్ 9న సాయంత్రం 5.34 గంటలకు జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 20 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో శాంతి చేకూరడంతో పాటు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థికంగా లాభపడే సూచనలున్నాయి. ఈ జ్యేష్ఠ నక్షత్ర సంచారంతో పలు రాశులవారికి శుభప్రదంగా ఉండనున్నది.
శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల్లో సామర్యపూర్వక వాతావరణం నెలకొంటుంది. పాత వివాదాలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబీకుల నుంచి మీకు సహకారం అందుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా, పెట్టుబడులు, ప్రణాళిక, ఆర్థిక పరమైన నిర్ణయాల్లో మీకు సానుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ త్వరగా ఫలిస్తాయి. సంపద, శ్రేయస్సుతో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తేలికపాటి వ్యాయామం చేయడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో కొత్త పరిచయాలు, నెట్వర్కింగ్ అవకాశాలు మంచి ఫలితాలు ఇస్తాయి.
ఈ సమయం కన్యారాశి వారికి సైతం చాలా శుభప్రదంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రంలో శుక్రుడు సంచారంతో మీ జీవితంలో ఆనందంతో పాటు ప్రేమ వ్యవహారాల్లో సమతుల్యతను తీసుకువస్తుంది. పనిలో విజయం, కొత్త అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారం, ఉపాధికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో సామరస్య పూర్వక వాతావరణం నెలకొంటుంది. సంపద, శ్రేయస్సుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక నిర్ణయాల్లో లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం ద్వారా మనశ్శాంతి నెలకొంటుంది. మీలోని సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సమయంగా నిలుస్తుంది.
మీనరాశి వారికి సైతం శుక్రుడి సంచారం కారణంగా సకల శుభాలు జరుగుతాయి. ఈ సమయంలో సోషల్ స్టేటస్ పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. ఒత్తిళ్లు, సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులతో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ, సంబంధౠలు మరింత మరితంగా మధురంగా ఉంటాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధాన్యంలో సమయం గడపడం కారణంగా మనసుకు స్థిరత్వం, శాంతి లభిస్తాయి. కుటుంబంలోని పెద్దల మద్దతు, ఆశీర్వాదాలు పొందుతారు. మీ ప్రయత్నాలకు విజయం దక్కుతుంది.
Read Also :
Mars Transit | మూల నక్షత్రంలోకి కుజుడు.. ఈ మూడురాశుల వారికి జిడ్డులా పట్టబోతోన్న అదృష్టం..!
Labh Drishti Yoga | త్రికేదశ యోగం.. ఈ మూడురాశుల వారికి డబ్బే డబ్బు..!