Labh Drishti Yoga | వేద జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరోరాశిలోకి ప్రవేశిస్తుంటుంది. ఒక గ్రహం ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటుంది. కొన్ని సంవత్సరం, రెండు సంవత్సరాలు కదులుతుంటారు. కానీ, నెప్ట్యూన్ (వరుణ గ్రహం) మాత్రం ఒకే రాశిలో దాదాపు 13 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశిచక్రాన్ని పూర్తి చేసేందుకు దాదాపుగా 164 సంవత్సరాలు పడుతుంది. దాంతో ఆయా రాశివారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం వరుణ గ్రహం మీనరాశిలో సంచరిస్తుంది. మీనరాశిలో పలు గ్రహాలతో కలిసి వరుణుడు సంచరిస్తున్నాడు. ప్రస్తుతం, వరుణుడు.. శుక్రుడితో 60 డిగ్రీల కోణంలో ఉన్నాడు. దాంతో త్రికేదశ యోగం ఏర్పడింది. దీన్నే లాభ దృష్టి యోగంగా పిలుస్తారు. వేద జోతిషశాస్త్రం ప్రకారం మూడురాశుల వారికి శుభపద్రంగా ఉంటుంది. ఈ యోగం కారణంగా మూడురాశుల్లో జన్మించిన వారంతా ప్రతి అంశంలో విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. ఈ యోగం డిసెంబర్ 2న ఉదయం 7.21 గంటలకు ఏర్పడింది.
సింహ రాశి వారికి శుక్రుడు, వరుణు గ్రహాల కలయికతో ఏర్పడిన త్రికేదశ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశి నాలుగో ఇంట సంచరిస్తున్నాడు. ఇది ఆర్థిక లాభాలకు సంకేతం. జీవితంలో సౌకర్యాలు సమకూరుతాయి. ఈ యోగంతో కెరీర్లో విజయం సాధించడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే, పని కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంతో మీకు ప్రయోజనం చేకూరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులతో మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారరంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. ఈ యోగం మీ వ్యక్తిగత జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య సామరస్యం, అవగాహన పెరుగుతుంది. అయితే, మీరు తీసుకునే ఆహారంపై దృష్టి సారిస్తే ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితంలో సంతృప్తి ఉంటుంది.
శుక్రుడు-వరుణు గ్రహాల సంచారంతో ఏర్పడిన త్రికేదశ సంయోగం కన్యరాశి వారికి సైతం శుభపద్రంగా ఉంటుంది. కన్యారాశి మూడో ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. దాంతో మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ జీవితంలో ఆనందం, సానుకూల అంశాలుంటాయి. ఆధ్యాత్మికత, మెంటల్ డెవలప్మెంట్పై మీరు ఆసక్తి పెంచుకుంటారు. ఈ సమయంలో కెరీర్, వ్యాపారరంగాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. అవుట్ సోర్సింగ్, కొత్త వ్యాపార ప్రాజెక్టు ద్వారా ఆర్థిక లాభాలు గడిస్తారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. పొదుపుపై దృష్టి పెడుతారు. ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ప్రేమ విషయాల్లోనూ మీకు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో అన్ని విషయాలపై చర్చిస్తారు. దాంతో వైవాహిక జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. మీరు ఒత్తిడి, అలసట నుంచి బయటపడితే ఆరోగ్యం సాధారణంగా బావుటుంది.
ధనుస్సు రాశి జాతకులకు త్రికేదశ యోగం శుభప్రదంగా నిలుస్తుంది. శుక్రుడు ఈ రాశి పన్నెండవ ఇంట సంచరిస్తున్నాడు. ఇది ఊహించి విజయం, అవకాశాలను తీసుకువస్తుంది. బ్యాంకు రుణం, ఆర్థిక సహాయం పొందడంలో విజయం సాధిస్తారు. కెరీర్లో దీర్ఘకాలిక ఒత్తిడి, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారరంగంలోని వారి పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభాలకు అవకాశాలుంటాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఈ యోగం ప్రేమ, సంబంధాల్లో సామరస్యాన్ని తీసుకువస్తుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, సంబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి.
Read Also :
“Shani-Budh Margi | ప్రత్యక్షంగా సంచరిస్తున్న శని-బుధ గ్రహాలు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!”
“Rahu Transit | శతభిష నక్షత్రంలోకి రాహువు.. ఈ మూడురాశుల వారి తలుపుతట్టనున్న అదృష్టం..!”