Shani-Budh Margi | ప్రత్యక్షంగా సంచరిస్తున్న శని-బుధ గ్రహాలు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!
Shani-Budh Margi | వేద జ్యోతిషశాస్త్రంలో శని-బుధుడు రెండు అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పేర్కొంటారు. బుధుడు తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్‌ను ప్రతీకం. కాబట్టి దాని ప్రతి రాశిచక్ర మార్పు తక్షణం ప్రభావం చూపుతుంది. ఈ గ్రహం దాదాపు ప్రతి 15రోజులకోసారి రాశిని మార్చుకుంటుంది.
Shani-Budh Margi | వేద జ్యోతిషశాస్త్రంలో శని-బుధుడు రెండు అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పేర్కొంటారు. బుధుడు తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్‌ను ప్రతీకం. కాబట్టి దాని ప్రతి రాశిచక్ర మార్పు తక్షణం ప్రభావం చూపుతుంది. ఈ గ్రహం దాదాపు ప్రతి 15రోజులకోసారి రాశిని మార్చుకుంటుంది. శని దాదాపు ప్రతి రెండున్నర సంవత్సాలకు ఒకసారి రాశులను మారుస్తాడు. శనిని కర్మ, న్యాయం, క్రమశిక్షణ, దీర్ఘాయువు, అడ్డంకులకు ప్రతీకగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాల కదలిక, ముఖ్యంగా వాటి ప్రత్యక్ష కదలిక జ్యోతిషంపరంగా కీలకంగా పండితులు చెబుతారు. శనైశ్చరుడు ఇటీవల మీనరాశిలో, ధనుస్సు రాశిలో బుధుడు ప్రత్యక్షంగా మారాడు. రెండురాశుల సంచారంతో ఏయే రాశులవారిపై శుభప్రభావం ఉంటుంది.
మిథునరాశి..
శని, బుధుడు ఇద్దరు ప్రత్యక్షంగా మారడంతో మిథునరాశి పురోగతి, స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. పదో ఇంట్లో శని సంచారం కెరీర్ పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలను పొందుతారు. మీరు ఓ పెద్ద ప్రాజెక్టు బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. దాంతో మీ కెరీర్‌కు కొత్త దిశను చూపుతుంది. చిన్న పనికి సంబంధించిన ప్రయాణాలు సైతం సాధ్యమవుతాయి. భవిష్యత్‌లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం, భాగస్వామ్య విషయాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడులు, ఒప్పందాలతో మంచి లాభాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తుకు నిధులను ఆదా చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆరోగ్యపరంగానూ బాగుంటుంది. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. మొత్తం మీద కృషి, అంకితభావంతో ఈ సమయంలో సానుకూల ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు శని, బుధుల ప్రత్యక్ష సంచారం కారణంగా వారి జీవితాల్లో గణనీయమైన సానుకూల మార్పులను అనుభవిస్తారు. శని మీ అదృష్టానికి సంబంధించిన ప్రత్యక్షం సంచరిస్తాడు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఆరవ ఇంట్లో బుధుడు ప్రత్యక్ష కదలిక మానసిక సమతుల్యత మెరుగవుతుంది. దాంతో బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏ పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఈ సమయంలో సృజనాత్మక ప్రాజెక్టులు, కళాత్మక ప్రయత్నాలు, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రణాళికలతో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాత్మిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతో మీకు మనశ్శాంతి ఉంటుంది. విదేశీ పర్యటనలు, సుదీర్ఘ ప్రయాణాలు కూడా సాధ్యమవుతాయి. ఇది మీరు చేసే పనిలో సహాయకరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లోనూ లాభాలుంటాయి. ఈ సమయంలో వివాహితులకు ప్రత్యేకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీ సంబంధాలు మరింత బలపడుతాయి.
కుంభరాశి
కుంభరాశి వారికి శని, బుధుడు ప్రత్యక్ష సంచారం ద్వారా అదృష్టాన్ని తీసుకురానున్నది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. రెండో ఇంట్లో శని, 11వ ఇంట్లో బుధుడి సంచారం కారణంగా ఆర్థిక పురోగతి ఉంటుంది. కోరికలు ఫలించేందుకు అవకాశాలుంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరడంతో పాటు లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ఇంట్లో ఆనందోత్సాహలు వెల్లివిరుస్తాయి. మీ ఖ్యాతిని పెంచుకునేందుకు సహాయపడే కెరీర్లో కీలకమైన అవకాశం వస్తుంది. మీ కృషితో ఉన్నత స్థానం, గొప్ప విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సంపదను కూడబెట్టడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలను చూస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ప్రేరణగా ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. మొత్తం మీద ఈ కాలంలో జీవితంలో పురోగతి, స్థిరత్వం, కొత్త అవకాశాలు వస్తాయి.
Read Also :
Rahu Transit | శతభిష నక్షత్రంలోకి రాహువు.. ఈ మూడురాశుల వారి తలుపుతట్టనున్న అదృష్టం..!
Shani Gochar | కొత్త ఏడాదిలో మూడు నక్షత్రాల్లో శని సంచారం.. ఈ మాడురాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

