Rahu-Ketu Transit | జ్యోతిషశాస్త్రంలో రాహు-కేతువులను ఛాయగ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనంలో సంచరిస్తాయి. అంతే కాకుండా ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉండగా.. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అయితే, రెండు వేర్వేరు రాశుల్లో ఉన్న ఈ గ్రహాలు.. తమ నక్షత్రాలను మార్చుకున్నాయి. జ్యోతిషశాస్త్రం లెక్కల ప్రకారం.. రాహువు నవంబర్ 23న ఉదయం 9.29 గంటలకు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో కేతువు పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలోకి ప్రవేశించాడు. రాహువు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించగా.. పలు రాశులకు శుభఫలితాలు కలుగుతాయి. అదే సమయంలో పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఆయన విలాసాలకు కారకుడు. రాహు-కేతువల సంచారంతో పలు రాశులవారికి ఆనందం, అదృష్టం వరించడంతో పాటు పలు ప్రయోజనాలుంటాయి. ఆ అదృష్ట జాతకులెవరో తెలుసుకుందాం..!
మిథునరాశి వారికి రాహు-కేతు సంచారం శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. మీరు చాలాకాలంగా విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో అవివాహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనిచేసే చోట స్నేహితులు, తోటి ఉద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఖర్చులను నియంత్రించుకొని డబ్బును ఆదా చేసుకోవడంలో విజయం సాధిస్తారు. అందరికీ సమయం శుభపద్రంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి వారికి గతంలో చిక్కుకుపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. రాహు-కేతువుల అనుగ్రహం కారణంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. మీకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇల్లు, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కాలం ఆర్థికంగా, సామాజికంగా మీకు కలిసి వస్తుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. మార్కెట్లో కొత్త పరిచయాలు వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక ప్రధాన లక్ష్యం కోసం కష్టపడి పనిచేసిన మంచి ఫలితాలను చూస్తారు. వారంతా ఒక ప్రత్యేక గుర్తింపును కూడా ఏర్పరచుకుంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభ రాశి వారికి ఈ సమయంలో కృషికి తగిన ఫలితం కనిపిస్తుంది. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యక్తిగత అభివృద్ధిలో పురోగతి ఉంటుంది. ఇంటి నుంచి దూరంగా పనిచేసే వారు తమ కుటుంబాలతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. మీ ఇమేజ్ పెరుగుతుంది. అన్నిరంగాల్లో మీకు అనుకూలత ఉంటుంది.
Read Also :