Gajakesari Rajayogam | కొత్త ఏడాది 2026లో పలు రాశులవారికి సకల శుభాలను తీసుకురాబోతున్నది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడనున్నది. బృహస్పతి మిథునరాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఏదో ఒక గ్రహంతో కలిసి సంచరిస్తూ శుభయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగం దాదాపు 54 గంటల పాటు ఉంటుంది. దాని ప్రభావం ముఖ్యంగా ప్రజల జీవనశైలి మారుతుంది. చంద్రుడు జనవరి 2న ఉదయం 9.25 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 4న ఉదయం 9.42 గంటలకు అదేరాశిలో ఉంటాడు. ఈ సమయంలో ఏర్పడిన గజకేసరి రాజయోగం ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల్లో అపారమైన విజయాన్ని తీసుకురానున్నది. గజకేసరి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దాంతో జీవితంలో శ్రేయస్సు, గౌరవాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఆయారాశులవారి జీవితాల్లో సంపద, ఆనందం వెల్లివిరుస్తుంది.
గజకేసరి రాజయోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైంది. ఈ రాశివారికి ఈ యోగం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి రెండో ఇంట్లో బృహస్పతి, చంద్రుల సంయోగం కారణంగా ప్రభావాలు కనిపిస్తాయి. ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే నయమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహం, పుట్టిన రోజు లేదంటే ఇతర సంతోషకరమైన కార్యక్రమాలో పండుగ వాతావరణం ఉంటుంది. పెళ్లివాని యువతీ యువకులకు పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగరంగంలోని వారికి ప్రత్యేక లాభాలుంటాయి. కొత్త బాధ్యతలు తీసుకున్న వారు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ ప్రయత్నాలను అభినందిస్తారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇది ఆర్థిక విషయాల్లో సమతుల్యత తీసుకురావడంతో విజయం సాధిస్తారు.
మిథునరాశి వారి లగ్నం ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతున్నది. దాంతో వారి వ్యక్తిత్వం, కెరీర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ యోగం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి సలహాలు పొందడంతో పాటు వారి మార్గదర్శకత్వంలో మీ కెరీర్, వ్యాపారరంగంలో మంచి ఫలితాలు పొందుతారు. బోధన, రాజకీయాలు, పరిపాలన రంగాల్లో ఉన్న వారు విజయాలు సాధిస్తారు. ఈ సమయం వివాహానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడుతారు. తీర్థయాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. దాంతో భవిష్యత్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదం మీపై ఉంటుంది.
తులారాశి వారికి తొమ్మిదవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ కెరీర్లో కొత్త శిఖరాలను చేరుకునే అవకాశం ఉంటుంది. మీ పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారులు మీ ప్రయత్నాలను అభినందిస్తారు. సమాజంలో, పనిచేసే చోట మీ ఖ్యాతి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చే పని చేపట్టినా విజయవంతమవుతుంది. మీ జీవితంలో ఆనందం, సంతృప్తి ఉంటుంది. కృషి, అంకితభావంతో మీ లక్ష్యాలను సాధిస్తారు.
Read Also :