Shani Dosham Remedies | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. ఓ వ్యక్తికి అతని కర్మకల ప్రకారంగా ఆయన ఫలితాలను ప్రస్తాదిస్తుంటాడు. జీవితంలో మంచి పనులు చేస్తూ కష్టపడి పని చేసే వారిపై ఆయన అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటారు. ఆర్థిక, శారీరక, మానసిక సమస్యల పాలుకావాల్సి వస్తుంది చెబుతుంటారు. స్కంద పురాణం, బృహత్ సంహిత వంటి పురాణాలు సైతం కొన్ని పనులు శనైశ్చరుడిని తీవ్ర గోపానికి దారి తీస్తాయని పేర్కొన్నాయి. ఆ పనులు ఏంటీ ? నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం..!
తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను అగౌరవపరిచే వ్యక్తులపై శనైశ్చరుడు అసంతృప్తితో ఉంటాడు. అలాంటి వ్యక్తులు తరచుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మీరు తెలియకుండానే అలా చేసి ఉంటే, మీరు వెంటనే క్షమాపణ చెప్పుకొని తప్పును సరిదిద్దుకోవడం మంచిది. శనైశ్చరుడు న్యాయానికి అధిపతి. ఆయన ఎప్పుడూ పేదల పక్షాన ఉంటాడు. పేదలను, కార్మికులను అగౌరవపరిచే వారిపై ఆగ్రహంతో ఉంటాడు. ముఖ్యంగా స్త్రీలను, అనాథలను బాధపెట్టేవారు ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు ఎదుర్కొంటారు. ప్రమాదాల బారినపడుతారు. ఇతరులతో అబద్ధం చెప్పడం, మోసం చేయడం అంటే శనికి అసహ్యకరం. తత్ఫలితంగా వారు ఆర్థిక నష్టం, చట్టపరమైన తదితర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ద్రోహం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. శని కర్మఫలదాత అయినందున కష్టపని చేయకుండా బాధ్యతల నుంచి తప్పించుకునే వారు. సమయాన్ని వృథా చేసేవారంటే ఆయన కఠినమైన ప్రభావానికి లోనవుతారు. ముఖ్యంగా సాడే సాతి సమయంలో సోమరితనం జీవితంలో అడ్డంకులను సృష్టిస్తుంది.
శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం ప్రత్యేక పూజలు చేశాయి. శని ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి. “ఓం శం శనిచార్య నమః” అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు, బూట్లు దానం చేయడం శుభప్రదం. హనుమాన్ చాలీసా పారాయణం చేసి పేదలకు భోజనం పెట్టడం, నూతన వస్త్రాలు దానం చేయాలి. జంతువులకు నీరు, దాన అందించడం ద్వారా శని సంతోషపడుతాడు. దాంతో ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది. శని ప్రభావం మొత్తం తగ్గకపోయినా కొంత వరకు ప్రభావం తగ్గుతుందని పండితులు పేర్కొంటున్నారు.
Read Also :
“Sun Transit | వృశ్చిక రాశిలో సూర్యుడు.. ఈ మూడు రాశులని కటాక్షించబోతున్న ఆదిత్యుడు..!”
“Budh Vakri | తిరోగమనంలో బుధుడు.. వృశ్చిక రాశి మినహా ఈ మూడురాశులవారు తస్మాత్ జాగ్రత్త..!”