Budh Vakri | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటాయి. పలుసార్లు ప్రత్యక్షంగా సంచరిస్తుండగా.. పలుసార్లు తిరోగమనంలో ఉంటాయి. తెలివితేటలు, వాక్కు కారకుడైన బుధుడు కుజుడి రాశి అయిన వృశ్చిక రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబర్ 29 వరకు తిరోగమనంలో ఉంటాడు. నవంబర్ 23న తులరాశిలోకి వెళ్తాడు. నవంబర్ 30 వరకు ప్రత్యక్షంగా ఉంటాడు. డిసెంబర్ 6న మళ్లీ వృశ్చికరాశిలోకి వెళ్తాడు. దాదాపు 18 రోజుల పాటు బుధుడు తిరోగమనంలో ఉంటాడు. బుధుడి సంచారంతో పలు రాశులవారు ఇబ్బందులుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మేషరాశి ఎనిమిదో ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. జాతకంలోని ఈ ఇల్లు ఆకస్మిక ధనలాభం, నష్టాలను సూచిస్తుంది. అలాగే, ఇది రహస్యానికి సంబంధించిన ఇల్లు కావడంతో మీరు మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం, కెరీర్, వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
వృషభరాశి వారికి ఏడవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది వైవాహికి జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఈ సమమంలో మీరు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. వీలైనంత వరకు వివాదాలు, కోపతాపాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
కర్కాటక రాశి ఐదవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఐదవ ఇల్లు విద్య, పిల్లలు, ప్రేమ సంబంధాలను సూచిస్తుంది. దాంతో బుధుడు తిరోగమనంలో ఉండటం వలన పిల్లల విద్యలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి మొదటి ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. రచనా రంగంలో ఒక పెద్ద విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
Read Also :
“Navapancham Raja Yogam | శని, బుధుడి కలయికతో రాజయోగం.. మారనున్న ఈ మూడురాశుల వారి జాతకం..!”
“Shatanka Yogam | గురువు, శుక్రుడి సచారంతో శతంక యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!”