Shatanka Yogam | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి ప్రాముఖ్యం ఉంది. గ్రహాలు నిర్ణీత సమయంలో రాశిచక్రాలను మార్చుకుంటాయి. ఈ మార్పు సమయంలో శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. శుభయోగాలు ఓ వ్యక్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మంగళవారం శుక్రుడు, బృహస్పతి వంద డిగ్రీల కోణంలోకి వచ్చారు. దాంతో శతంక యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా పలు రాశులవారి అదృష్టం మరింత పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కెరీర్లో ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉంది. ఈ యోగం కారణంగా ఎక్కువ ఏ రాశులవారికి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం..!
ధనుస్సు రాశి వారికి, శతంక యోగం చాలా శుభపద్రంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం కారణంగా మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగరంగంలో ఉన్న వారు మెరుగైన అవకాశాలను పొందే సూచనలున్నాయి. ఈ సమయంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సొంత వ్యాపారాలు చేస్తున్న వారు సానుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ యోగం సమయంలో అదృష్టం కలిసి వస్తుంది.
గురు, శుక్రుల కలయిక కారణంగా ఏర్పడిన శతంక యోగం కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చాలారోజుల నుంచి చేతికి అందకుండా పోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. కెరీర్లో, వ్యాపారంలో సానుకూల మార్పులుంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారి కల సాకారమవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
కన్యారాశి వారికి శతంక యోగం చాలా శుభప్రదంగా, ఫలవంతంగా నిలుస్తుంది. మీ ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులు పనిచేసే చోట గణనీయమైన మార్పులు చూస్తారు. ఈ సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు వేసే ప్రణాళికల్లో కొన్నింట్లో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలున్నాయి. వాహన యోగానికి ఆస్కారం ఉంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు గోచరిస్తున్నాయి.