Navapancham Raja Yogam | వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రముఖ స్థానం ఉంది. శని కర్మ కారకుడు. న్యాయానికి అధిపతి. ఓ వ్యక్తి కర్మల ఆధారంగా ఆయన ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మిగతా గ్రహాలతో పోలిస్తే శని నెమ్మదిగా కదులుతుంటాడు. అందుకే ఆయన ఒకేరాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. శని ప్రభావం అన్నిరాశులపై ఉంటుంది. ఆయన శుభస్థానంలో ఉంటే సానుకూల ప్రభావం ఉంటుంది. అశుభ స్థానంలో ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే, సంచార సమయంలో శని భగవానుడు ఇతర గ్రహాలతో రాజయోగాలను ఏర్పరుస్తాడు. శని ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబర్ 23న బుధుడు, శని ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటారు. దాంతో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. బుధుడు ఇదే రోజున తులరాశిలోకి ప్రవేశిస్తాడు. తొమ్మిదో, ఐదవ స్థానాల్లోకి వెళ్లడంతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ నవ పంచమ రాజయోగంతో పలు రాశులవారికి గణనీయమైన ప్రయోజనాలుంటాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం..!
శని-బుధుడి సంయోగం కారణంగా ఏర్పడే నవ పంచమ రాజయోగం ధనస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో శని సంచారం నాల్గో ఇంట్లో జరుగుతుంది. ఇది లాభదాయకమైన ఇల్లు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలుంటాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. మీ అదృష్టం కలిసి వస్తుంది. అందరి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి గణనీయమైన లాభాలుంటాయి.
శని, బుధుడు కలయికతో ఏర్పడనున్న రాజయోగం కారణంగా మిథునరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు తొమ్మిదో ఇంట, శని పదో ఇంట సంచరించనున్నారు. దాంతో ఈ సమయంలో అసంపూర్ణంగా మిగిలిన పనులన్నీ పూర్తవుతాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదృష్టం కలిసి వస్తుండడంతో సంపద పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలని చూస్తుంటే.. మీ కోరిక నెరవేరుతుంది.
కుంభరాశి వారికి నవ పంచమ రాజయోగం శుభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. అనేక సానుకూల మార్పులుంటాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఆస్తి విషయాలకు సంబంధించిన చట్టపరమైన కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు గౌరవం, మర్యాదలు పొందుతారు.
Read Also :
“Venus Transit | తులరాశిలో శుక్రుడి సంచారం.. మిథునరాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?”
“Shatanka Yogam | గురువు, శుక్రుడి సచారంతో శతంక యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!”
“Guru Vakri | కర్కాటకరాశిలో గురువు తిరోగమనం.. ఆ రాశులవారికి సంపద, అన్నింట్లో విజయాలు..!”