Venus Transit | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు కాలానుగుణంగా, నిర్దిష్ట వ్యవధిలో తమ రాశిచక్రాలను మారుస్తాయి. ఆనందం, శ్రేయస్సుకు కారకమైన శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు తులారాశి పాలకగ్రహం. శుక్రుడిని, ప్రేమ, ఆనందం, సందప, విలాసాలకు సంబంధించిన గ్రహంగా పేర్కొంటారు. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, సౌకర్యం, ఆనందం, వైవాహిక ఆనందం, విలాసాలకు ప్రతీకగా పేర్కొంటారు. దాంతో ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటారు వారంతా అన్ని రకాల సుఖాలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుక్రుడు ఒకరాశిలో దాదాపు 30 రోజులు సంచరిస్తాడు. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి సంచారం కారణంగా మిథునరాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..!
రాశిచక్రంలో మూడోరాశి మిథునరాశి. ఈ రాశి ఐదవ, ఆరవ ఇండ్లకు పాలకగ్రహం శుక్రుడు. శుక్రుడు ఐదో ఇంట్లో తులారాశిలోకి ప్రవేశించాడు. ఇది పిల్లల నుంచి ఆనందాన్ని తీసుకువస్తుంది. విద్యారంగంలోని వారికి గణనీయమైన విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కెరీర్లో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి విజయం వరిస్తుంది. ఆర్థికంగా శుభపద్రంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించేందుకు అవకాశం లభిస్తుంది. ఓ వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో పాటు వ్యాధులు చుట్టుముడుతాయి.
శుక్రుడు అశుభ స్థానాల్లో సంచరిస్తే ఆ వ్యక్తి భౌతిక సుకాలను కోల్పోతాడు. ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. విలాసాలను ఆస్వాదించేందుకు ఇష్టపడరు. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ప్రజాదరణ పొందుతాడు. అలాంటి వ్యక్తులు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. భౌతిక సుఖాలు పెరిగితే అది శుక్రుడి శుభ సంకేతానికి సూచిక. ఓ వ్యక్తి ఏదైనా పనిలో అకస్మాత్తుగా విజయాలు పొందినట్లయితే అయితే శుక్రుడి ప్రభావమేనని తెలుసుకోవాలి. శుక్రుడు శుభ దృష్టిలో ఉంటే ధనలాభం, విలాసవంతమైన జీవితం, సౌకర్యాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు, వివాహ సంబంధాలు మెరుగుపడతాయి.
Read More :
Shatanka Yogam | గురువు, శుక్రుడి సచారంతో శతంక యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!