జై నూర్ : జైనూరు ( Jainoor ) లో ఆదివారం భారీ వర్షం పడింది. ఫిబ్రవరి నెలలో ఎండలు మండే నెలలో వర్షం( Rains ) పడడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులుగా ఉంటూ ఆదివారం ఒక్కసారిగా వర్షం పడటంతో రబీ పంట వేసిన రైతులకు కాస్త ఊరట లభించింది.
పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు వారం రోజులు పాటు వ్యవసాయ పంటలకు నీరు అందించే శ్రమ తగ్గిందని స్థానికులు అంటున్నారు. ఈ వర్షం వల్ల మండల కేంద్రంలో వ్యాపారస్తులు,గ్రామస్థులకు కాస్త ఇబ్బంది కలిగింది.