Maa Inti Bangaram | విడుదల తేదీని ప్రకటించిన సమంత ‘మా ఇంటి బంగారం’
Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.
Samanta | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వేసవి కానుకగా మే 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత సమంత తెలుగు వెండితెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఆమె ఒక మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తూనే, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం విశేషం. గతంలో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు కథ అందించగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియా వేదికగా “యాక్షన్ ప్యాక్డ్ గోల్డెన్ హంట్ – ఈ వేసవికి థియేటర్లలో కలుద్దాం” అంటూ కొత్త పోస్టర్‌ను పంచుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా సమంత కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.