Venus Transit | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకుంటుంటాయి. శుక్రుడు ఈ నెల 2న తులారాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడిని ప్రేమ, ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు విలాసాలకు కాకరమైన గ్రహంగా పేర్కొంటారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో వారు అన్ని రకాల సుఖాలు, విలాసాలు పొందుతారు. శుక్రుడు ఒక రాశిలో సుమారు 30 రోజులు ఉండి, ఆపై మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు.
వృషభ రాశి మొదటి, ఆరో ఇండ్లకు అధిపతి శుక్రుడు. మీ జాతకంలోని ఆరో ఇంట్లో శుక్రుడు తులారాశిలో ప్రవేశించాడు. దాంతో మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు భౌతిక సుఖాల కోసం డబ్బు ఖర్చు చేయడంపై ఆలోచిస్తారు. ఈ సమయంలో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థానాన్ని చేరుకుంటారు. అయితే, పనిచేసేచోట మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. తత్ఫలితంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం, జీవిత భాగస్వామి ప్రతి విషయంలో మీకు తోడుగా నిలుస్తారు. అయితే, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
అయితే, శుక్రుడి ఏదైనా జాతకంలో శుభ స్థానంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా సుఖాలను అనుభవిస్తారు. జీవితంలో దేనికైనా ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అదే సమయంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. రాజుగా ఉన్నా పేదవాడిగా మారుతాడు. వైవాహిక జీవితంలో ఇబ్బందులుపడుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడుతుంది. అశుభ ఫలితాల కారణంగా వ్యక్తి ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు.
జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో డబ్బు నిల్వదు. ఓ జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. శుక్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతి పనిలో వైఫల్యాన్ని ఎదుర్కోవడంతో పాటు భారీగా శ్రమపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కష్టపడ్డా ఫలితం దక్కదు. విజయాన్ని అందుకోవడం కష్టంగా మారుతుంది.
Read Also :
“Guru Vakri | కర్కాటకరాశిలో గురువు తిరోగమనం.. ఆ రాశులవారికి సంపద, అన్నింట్లో విజయాలు..!”