Predictions 2026 | 2025 సంవత్సరం ముగింపునకు చేరింది. త్వరలో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం ప్రాముఖ్యం ఉంది. చాలా గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకోబోతున్నాయి. ఇందులో కొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉండనున్నాయి. మరికొన్ని ప్రత్యక్షంగా ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో శని, శుక్రుడికి ప్రత్యేకత ఉంది. 2026 ప్రారంభంలో శని, శుక్ర గ్రహాల సంయోగం జరుగబోతోంది. ఈ రెండుగ్రహాలు స్నేహపూర్వక గ్రహాలు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులవారికి కాలం కలిసి వస్తుంది. కొందరికి అదృష్టం మారనున్నది. ఆకస్మిక ఆర్థిక లాభాలు, పురోగతికి సూచనలున్నాయి. ఇంతకీ ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందాం..!
2026లో శని, శుక్రుల సంయోగం వృషభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంయోగం మీ రాశిచక్రంలో ఆదాయం, లాభానికి సంబంధించిన గృహంలో సంభవించనుంది. ఫలితంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడులతో గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగరంగంలో ఉన్న వారికి ప్రమోషన్లతో పాటు జీతం పెరిగే ఛాన్స్ ఉంది. మీరు మీ శత్రువులు, విరోధులపై విజయం సాధిస్తారు. ఈ సంయోగం మీ భౌతిక సుఖాలను పెంచుతుంది. కొత్త ఇల్లు లేకపోతే వాహనం కొనాలన్న మీ కల ఫలిస్తుంది. మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
శని, శుక్రుల సంయోగం కర్కాటకరాశి వారికి చాలాశుభప్రదంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశిచక్రంలోని అదృష్టానికి సంకేతమైన తొమ్మిదో ఇంట్లో ఈ సంయోగం జరుగనున్నది. ఫలితంగా మీకు అంతా అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో పదోన్నతి, వ్యాపారంగంలో మంచి లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు 2026లో శని, శుక్రుల సంయోగం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆనందంగా ఉంటారు. అయితే, మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీన రాశి వారికి శని, శుక్రుల సంయోగం చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ కలయిక మీ లగ్నం ఇంట్లో ఏర్పడుతుంది. దాతో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. సామాజికంగా గుర్తింపు సాధిస్తారు. వ్యాపార విస్తరణ సాధ్యపడుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. ఈ గ్రహ సంయోగం మీ వివాహ జీవితంలో ప్రేమ ఆనందాన్ని తీసుకువస్తుంది. వివాహం చేసుకోవాలని భావిస్తున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో చాలాకాలంగా నిలిచిపోయిన ప్రణాళికలన్నీ ఫలిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి కల సాకారమవుతుంది. చాలాకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి.
Read Also :
Shani Transit | మీనరాశిలో శని సంచారం.. ఈ మూడు రాశులవారి జీవితాలే మారబోతున్నయ్..!
Ketu Gochar | సింహరాశిలో కేతువు సంచారం.. ఈ నాలుగురాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం..!