Shani Margi | జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పిలుస్తారు. ఆయన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. అందేకు ఆయనను కర్మఫలదాత’గా పిలుస్తారు. శని నవగ్రహాలో నవగ్రహాల్లో ప్రముఖ స్థానం ఉంది. శని సంచారం, సయోగంతో 12 రాశులతో పాటు దేశ, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటాడు. ప్రస్తుతం శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 28 వరకు ఇదే రాశిలో సంచరించబోతున్నాడు. పండితుల ప్రకారం.. శని సంచారం సమయంలో పలురాశి చక్రాల వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కెరియర్లో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పురోగతి తదితర అవకాశాలను పొందుతారు. శని సంచారంతో మూడురాశుల వారికి అదృష్టం వరించనున్నది. ఇంతకీ ఆ రాశులెంటో తెలుసుకుందాం..!
మిథునరాశి వారికి శనైశ్చరుడి సంచారం కారణంగా వ్యాపారరంగంలోకి వారికి ఆర్థిక లాభాలుంటాయి. ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారులకు డబ్బు చేతికి అందుతుంది. ఈ సమయంలో వ్యాపారులు డబ్బు పొందుతారు. అన్నిరంగాల్లోని వారికి మంచి అవకాశాలుంటాయి. ఈ సమయంలో కళారంగంలోని వారు పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కెరీర్, వ్యాపారంలో పూర్తి అనుకూలత ఉంటుంది. భాగస్వాములతో సంతోషంగా సమయం గడపడానికి అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి వారికి భారీ ప్రాజెక్ట్ లభించే అవకాశం ఉంది. మీ రంగాల్లో గుర్తింపును పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి గౌరవాన్ని పొందుతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులు పొందుతారు. ఇది జీవితంలో సానుకూల మార్పులతో పాటు భౌతిక ఆనందాన్ని పెంచే అవకాశం ఉంది. భూమి, భవనాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారంతో సంబంధాలున్న వ్యక్తులతో ప్రయోజనం పొందుతారు. సంబంధాలు బలపడుతాయి. కోరుకున్న వారికి కోరుకున్న చోటుకి బదిలీ పొందే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ వర్గం పని రంగంలో అనుకూలంగా ఉంటుంది. పనులను పూర్తి చేయడంలో కుంభరాశి వారికి ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీరు కార్యాలయంలో హృదయపూర్వకంగా పని చేస్తారు. కొత్త ప్రాజెక్ట్‌లో భాగమవుతారు. కష్టమైన పనులను తమ భుజాన వేసుకునేందుకు వెనుకాడరు. ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ కాలంలో కుంభ రాశి వారికి కెరీర్లో కొత్త స్థానాన్ని అలంకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also :
Triekadashi Yogam | వృశ్చికరాశిలో బుధుడి సంచారంతో త్రి ఏకాదశ యోగం.. ఈ మూడురాశులకు గోల్డెన్ డేస్..!
Mars Transit | వృశ్చికరాశిలోకి కుజుడు.. ఈ మూడురాశులవారికి కష్టాలు తప్పవ్..!
Malavya Rajayogam | పవర్ఫుల్ మాళవ్య రాజయోగం.. ఈ మూడు రాశులవారి జాతకాలే మార్చబోతున్న శుక్రుడు..!