Malavya Rajayogam | వేద జ్యోతిషశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఖగోళ వస్తువుల స్థానాలు, కదలికల ఆధారంగా మానవ జీవితాన్ని, భూసంబంధ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. వివిధ సంస్కృతుల్లో జ్యోతిషశాస్త్రం ఒక రకమైన భవిష్యవాణి, వ్యక్తిగత ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసే సాధనంగానూ ఉపకరిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాల స్థానచలనం కారణంగా పలు శుభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. నవంబర్ మాసంలో శుక్రుడి తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ క్రమంలో పవర్ఫుల్ మాళవ్య రాజయోగం ఏర్పడబోతోతున్నది. ఈ రాజయోగం పలువురి అదృష్టాన్ని తీసుకురాబోతున్నది.
జ్యోతిషశాస్త్రంలో మాళవ్య రాజయోగం మహాపురుష రాజయోగాల్లో ఒకటి. ఇది జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదమైంది. సంపద, శ్రేయస్సు, విలాసాలకు కారకుడైన శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరిస్తున్న సమయంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు నవంబర్ 2న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దాంతో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం నవంబర్ 26 వరకు ఉంటుంది. ఈ కాలంలో మూడురాశుల వారికి శుభకరంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావడంతో పాటు సంపదను ఈ రాజయోగం తీసుకువస్తుంది. నవంబర్ నెలాఖరు వరకు గణనీయమైన వృద్ధిని చూస్తారు. ఇంతకీ మూడు అదృష్ట రాశులవారెవరో చూసేద్దాం రండి..!
జ్యోతిష్యం ప్రకారం, తులారాశిలో జన్మించిన వ్యక్తులు మాళవ్య రాజయోగం కారణంగా ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. ఈ రాశిలో సంచారం సమయంలోనే ఈ రాజయోగం ఏర్పడుతుంది. రాజయోగం కారణంగా వ్యక్తిత్వం మెరుగవుతుంది. సంపదను తీసుకువస్తుంది. కొత్త ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంబంధాలు బలపడుతాయి. అవివాహితులకు పెళ్లి అయ్యే సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది.
జ్యోతిష్యం ప్రకారం.. మకరరాశిలో జన్మించిన వ్యక్తులు కూడా ఈ రాజయోగం చాలా శుభకరంగా ఉంటుంది. చాలా ప్రయోజనాలను పొందే సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉద్యోగోన్నతి లభించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి అదృష్టం మరింత కలిసివస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను చూస్తారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ జీవితం ఆనందంగా గడుపుతారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మాళవ్య రాజయోగంతో ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు గణనీయంగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. పెట్టుబడుల కారణంగా లాభాలను చూస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను ఆర్జిస్తారు. అందకుండా పోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. పలు శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి.
Read Also :
“Mercury Transit | వృశ్చిక రాశిలోకి బుధుడు.. కన్యారాశి సహా ఈ మూడురాశులవారిపై కనక వర్షమే..!”