Mars Transit | కుజుడు తన సొంతరాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి సంచారంతో రుచక మహాపురుష రాజయోగం ఏర్పడనున్నది. ఇది చాలా శుభపద్రమైన యోగం. జ్యోతిషశాస్త్రంలో ఈ రాజయోగంతో పలురాశుల వారికి భౌతిక సుఖాలకు కొరత ఉండదు. అక్టోబర్ 27న మధ్యాహ్నం 2.43 గంటలకు కుజుడు తులరాశిలో నుంచి వృశ్చికంలోకి వెళ్లాడు. జ్యోతిషశాస్త్రంలో కుజుడిని ఉత్సాహం, అభిరుచి, యుద్ధం, శౌర్యానికి ప్రతీకగా పేర్కొంటారు. వృశ్చికంలో కుజుడు సంచారంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలుంటాయి. మరికొన్ని రాశులవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇబ్బందులకు గురయ్యే రాశులు ఏంటో చూద్దాం..!
కన్యరాశి మూడు, ఎనిమిదో ఇండ్లకు కుజుడు పాలకగ్రహం. అక్టోబర్ 27న కుజుడు మీ రాశిలోని మూడో ఇంట్లోకి ప్రవేశించాడు. జాతకంలో మూడవ ఇల్లు మీ ధైర్యాన్ని సూచిస్తుంది. కన్యరాశి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మూడో ఇంట్లో కుజుడి సంచారం సాధారణంగా సానుకూల ఫలితాలు ఇస్తుంది. కుజుడి సంచారం కన్యారాశి వారికి కొన్ని ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంది.
ధనుస్సు రాశి వారికి కుజుడు జాతకంలో ఐదవ, పన్నెండవ ఇండ్లకు కుజుడు పాలకగ్రహం. కుడుజు మీ రాశి 12వ ఇంట్లో సంచారం జరుగుతుంది. పన్నెండవ ఇంట్లో కుజుడు సంచారం శుభప్రదంగా భావించారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. శారరీకంగా, మానసికంగా బాధలు పెరుగుతాయి.
కుంభరాశి మూడు, పదో ఇండ్లకు కుజుడు పాలకగ్రహం. అక్టోబర్ 27న కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. పదో ఇంట్లో కుజుడి సంచారం అశుభంగా పరిగణిస్తారు. పదో ఇంట్లో ఈ కుజగ్రహ సంచారంతో కెరీర్లో అడ్డుకులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కుంభరాశివారు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.