Ketu Gochar | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాహు, కేతువులను ఛాయగ్రహాలుగా పేర్కొంటారు. కేతువు ఒక మర్మమైన, ప్రభావవంతమైన గ్రహం. ఇది తరచుగా తిరోగమనంలో కదులుతుంది. దాదాపు ప్రతి ఏడాదిన్నరకోసారి రాశిని మార్చుకుంటుంది. ఈ ఏడాది మే 18న కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. వచ్చే ఏడాది కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దానికి ముందు కేతువు 11 నెలల పాటు కొన్ని రాశులకు ప్రయోజనం చేకూర్చనున్నాడు. ఈ 11 నెలల్లో కేతువు నాలుగురాశులవారు ఆకస్మిక సంపద, కొత్త అవకాశాలతో పాటు ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఈ సమయంలో ఈ రాశులవారి జీవితాల్లో గణనీయమైన సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. జీవితంలో కొత్త విజయం, శ్రేయస్సును తీసుకువస్తుంది.
వృషభ రాశి వారికి కేతువు పూర్వీకుల ఆస్తి, పెట్టుబడులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆస్తి నుంచి మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కెరియర్లో కొత్త మార్పులుంటాయి. జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కూడా గణనీయమైన లాభాలను ఆర్జిస్తారు. జీవితంలో గణనీయమైన ఆనందాన్ని పొందే అవకాశం ఉంది.
మిథున రాశి జాతకులు కొత్త సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్తగా ఆర్థిక అవకాశాలు అందుకుంటారు. పని చేసే చోట కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలుగుతుంది. పలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అయితే, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కొత్త సంవత్సరం వృశ్చిక రాశివానికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కెరియర్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగం మార్పు కోరుకునే వారి కల ఫలిస్తుంది. కొత్త అవకాశాలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారవేత్తలకు ఆర్థికపరమైన లాభాలుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు పెరుగుతుంది.
కేతువు ప్రభావంతో మీనరాశి వారికి సైతం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, శని సాడే సతి ఇప్పటికీ కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశాలుంటాయి. కానీ, విలాసలకు పోతే ఖర్చులు భారీగా పెరుగుతాయి. దాంతో అప్రమత్తంగా ఉండడం అవసరం. సవాళ్లు, అడ్డంకులను అధిగమించడం వల్ల కెరీర్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం.
Read Also :
Triekadashi Yogam | వృశ్చికరాశిలో బుధుడి సంచారంతో త్రి ఏకాదశ యోగం.. ఈ మూడురాశులకు గోల్డెన్ డేస్..!