Sun Transit | గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు. ఆయన రాశిచక్రాలను మారుస్తున్న సమయంలో నక్షత్రాన్ని సైతం మారుతుంటారు. త్వరలో సూర్యుడు నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సూర్యుడు తన రాశిని ప్రతి నెలా మారుస్తూ ఉంటాడు. దాంతో పాటు అది ఉన్న నక్షత్రం సైతం మారుతుంది. నవంబర్ 19న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 2 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. సూర్యుడి గౌరవం, హోదా, ప్రతిష్ట, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటారు. అనురాధ నక్షత్రం ప్రధాన లక్షణాలు విజయం, కృషి. దాంతో సూర్యుడు ఈ నక్షత్రంలోకి మారడంతో పలురాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు జరుగనున్నాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల నుంచి గౌరవం, మద్దతు లభిస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం..!
సూర్యుడి నక్షత్రం మార్పు కారణంగా మిథునరాశి వారికి కీలకం. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం నుంచి శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం మార్పు కోరుకుంటున్న వారి కల నెరవేరుతుంది. అవివాహితులకు ఈ సమయంలో వివాహానికి శుభపద్రంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ క్రమంగా తగ్గుతూ వస్తాయి. మీ తండ్రితో ఉన్న వివాదం ముగిసిపోతుంది.
సింహరాశి వారికి పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చాలాకాలంగా ఉన్న కోర్టు సంబంధిత వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. కళారంగంలో పురోగతి సాధిస్తారు. వారిని పదోన్నతి కోసం అవకాశాలున్నాయి. మీరు రచనా రంగంలో పనిచేస్తే.. మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులను కలవడం సాధ్యమవుతుంది. భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత విషయాల పరిష్కారం ఆనందాన్ని తెస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఈ సమయం వృశ్చికరాశి వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలమవంతమవుతాయి. కొత్త కోర్సులపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. అత్తింటి వారితో సంబంధాలు బలపడుతాయి. ఈ సమయంలో వాహనం కొనాలనే మీ కల ఫలిస్తుంది. ప్రభుత్వరంగంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే అవన్నీ తొలగిపోతాయి. కొత్త వ్యక్తులను కలువడం వల్ల మీ లక్ష్య సాధనకు సహాయపడుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Read Also :
Shani Transit | మీనరాశిలో శని సంచారం.. ఈ మూడు రాశులవారి జీవితాలే మారబోతున్నయ్..!
Ketu Gochar | సింహరాశిలో కేతువు సంచారం.. ఈ నాలుగురాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం..!