Mars Ast 2025 | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్ణీత సమయంలో ప్రయాణిస్తుంటారు. అవి కొన్ని సమయాల్లో ప్రత్యక్షంగా.. మరికొన్ని సమయాల్లో తిరోగమిస్తాయి. అలాగే, అస్తమించడంతో పాటు ఉదయిస్తాయి. దాని ప్రభావం ప్రపంచంతో పాటు 12రాశిచక్రాలపై కనిపిస్తుంది. యుద్ధం, ధైర్యం, శైర్యానికి ప్రతీక అయిన కుజుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 7న అస్తమించి అదే రాశిలో ఉంటాడు. కుజుడు అస్తమించడంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దాంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇంతకీ ఆ రాశులేంటో చూద్దాం..!
కుజుడు మేషరాశి తొలి, ఎనిమిదో ఇండ్లకు పాలకగ్రహం. నవంబర్ 7న ఎనిమిదో ఇంట్లో కుజుడు అస్తమిస్తాడు. దాంతో మేషరాశి జాతకులు ఈ సమయంలో చేసే పనుల్లో అడ్డంకులు, జాప్యం ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక సమస్యలు పెరుగుతాయి. అదే సమయంలో ఉద్యోగరంగంలో ఉన్న వారికి, కెరీర్లో మార్పులు ఆశిస్తున్న వారికి రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు ప్రయోజనకరంగా, లాభదాయకంగా ఉంటుంది. ఈ జాతకులు వ్యాపార ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య సమస్యలో గతంలోగా ఉంటాయి.
కుజుడు కర్కాటకరాశి ఐదు, పదో ఇండ్లకు పాలకగ్రహం. నవంబర్ 7న మీరాశి ఐదో ఇంట్లో కుజుడి అస్తమిస్తాడు. మీరు మీ పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ సమయలో మీకు మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. కెరీర్లో కొత్త అవకాశాలు మీ దరిచేరుతాయి. ఉపాధి కోరుకునే వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుజుడి అస్తమయంతో వ్యాపారరంగంలోని వారికి గణనీయమైన లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందడంతో పాటు మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. అయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకటే స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుజుడు సింహరాశి నాలుగో, తొమ్మిదో ఇండ్లకు పాలకగ్రహం. కుజుడు తన సొంత రాశి ఉంటూ సింహరాశి నాల్గో ఇంట్లో అస్తమిస్తున్నాడు. జాతకంలోని నాల్గో ఇల్లు తల్లి, ఆనందం, వాహనాలు, భూమికి సంబంధించినది. దాంతో సింహరాశి వారికి కుటుంబంలో శాంతి, ఆనందం లభించకపోవచ్చు. ఈ సమయంలో తమ కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మీ కెరీర్, వ్యాపారంలో మీరు ఊహించినంతగా లాభదాయకంగా ఉండకపోవచ్చు. వ్యాపారంరంగంలో ఉన్న వారు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. విలాసాల కోసం కొంత వరకు డబ్బును ఖర్చు చేస్తారు. కుజుడు అస్తమయం తర్వాత మీ జీవిత భాగస్వామితో సమయం గడపడంతో మీకు ఆనందం కలుగుతుంది. ఆరోగ్యంపరంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also :
Shani Transit | మీనరాశిలో శని సంచారం.. ఈ మూడు రాశులవారి జీవితాలే మారబోతున్నయ్..!
Ketu Gochar | సింహరాశిలో కేతువు సంచారం.. ఈ నాలుగురాశుల వారికి తలుపు తట్టబోతున్న అదృష్టం..!