Venus Transit | జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు ప్రేమ, సంబంధాలు, అందం, కళలు, ఆనందానికి కారకుడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి అన్ని రకాలు సుఖాలు ప్రసాదిస్తాడు. శుక్రుడు ఒకేరాశిలో దాదాపు నెల రోజుల పాటు సంచరిస్తాడు. ఆ తర్వాత మరో రాశిలోకి వెళ్తాడు. శుక్రుడు ఇటీవల తులరాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారంతో మేశ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..!
మేషరాశి రెండు, ఏడో ఇండ్లకు పాలకగ్రహం శుక్రుడు. మీ జాతకంలోని రెండో ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది మీ జీవిత భాగస్వామిపై అదనంగా డబ్బు ఖర్చు చేయడాన్ని సూచిస్తుంది. అయితే, ఈ సమయంలో కొన్ని అనవసరమైన ఖర్చులకు దారి తీసే పరిస్థితి ఉంటుంది. కెరీర్, వ్యాపారం, ఉద్యోగరంగంలోని వారు పని ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగం మారాలనే కోరిక వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సంబంధాల్లో కొంత ఉద్రిక్తతలు ఉంటాయి. చిన్న విషయాలకే అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకొని ఓపిక పట్టడం ఉత్తమం. ఆరోగ్యంపై సైతం శ్రద్ధ తీసుకోవడం మంచిది.
ఓ వ్యక్తి జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే.. సదరు వ్యక్తి వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. పిల్లల ఆనందాన్ని కోల్పోతాడు. లైంగిక ఆనందాన్ని పొందినా ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. భౌతిక సుఖాలకు దూరమవుతాడు. సదరు వ్యక్తి ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతాడు. విలాసాల వైపు దృష్టి సారించేందుకు ఇష్టపడడు. అయితే, ఎవరి జాతకంలో శుక్రుడి సానుకూల ప్రభావం పడితే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందరిలో మంచి గుర్తింపును సాధిస్తాడు. అలాంటి వ్యక్తులు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. భౌతిక సుఖాలు పెరుగుతాయో అది శుక్రుడి శుభ దృష్టికి సంకేతం. ఓ వ్యక్తి తాను చేస్తున్న పనిలో అకస్మాత్తుగా విజయం పొందితే ఆయన అనుగ్రహం ఉన్నట్లేనని పండితులు పేర్కొంటున్నారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఓ వ్యక్తి కళలు, వినోదరంగాల్లో రాణిస్తారు.
Read Also :
“Shani Transit | మీనరాశిలో శని సంచారం.. ఈ మూడు రాశులవారి జీవితాలే మారబోతున్నయ్..!”