Trigrahi Yogam | ఈ నెలలో మరో పవర్ఫుల్ త్రిగ్రహి యోగం ఏర్పడనున్నది. నవంబర్ 16న మధ్యాహ్నం 1.44 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే ఈ రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. అలాగే, కుజుడు సైతం ఇదే రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి పాలకగ్రహం కావడంతో కుజుడు.. ప్రభావం పెరిగింది. సూర్యుడు, బుధుడు, కుజుడు మధ్య స్నేహపూర్వక బంధం ఉంది. దాంతో వృశ్చిక రాశిలో ఏర్పడిన ఈ త్రిగ్రహి యోగం కొన్ని రాశిచక్ర గుర్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇల్లు కొనాలనే వారి కల సాకారమవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది.
మిథున రాశి వారికి ఇది ఒక ప్రత్యేక సమయంగా నిలుస్తుంది. మీ కుటుంబంలోకి కొత్తగా ఒక సభ్యుడు వస్తాడు. స్వదేశం, విదేశాల్లో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుగా కొత్త పనులు చేపడుతారు. స్నేహితులు, బంధువుల ద్వారా కళారంగంలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ అదృష్టం కారణంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సానుకూల ఫలితాలు కలిగే సూచనలున్నాయి. మీ కోరికలన్నీనెరవేరుతాయి.
తుల రాశి వారికి మంచి సమయం కలిసి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపవుతుంది. కష్టపడి పని చేయడం వల్ల ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తుంటాయి. వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు వాహనం, ఇల్లు, బంగారం, వెండి వస్తువులు కొనే అవకాశం ఉంది. ఇంటి నుంచి దూరంగా ఉన్న వారంతా కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందం జరిగే అవకాశం ఉంది. సృజనాత్మక కార్యకలాపాల్లో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి.
మీ వివాహ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో ప్రత్యేక సందర్శన ఆనందాన్ని తెస్తుంది. మీరు కొత్త ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. లాభాలు పొందుతారు. ఈ సమయం పనిలో మంచి పురోగతిని తెస్తుంది. వివాహ జీవితం మునుపటి కంటే మరింత ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాలు వస్తాయి. మీరు స్నేహితులతో పెట్టుబడి ప్రణాళికలో భాగమవుతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొన్ని చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Read Also :
Navapancham Raja Yogam | శని, బుధుడి కలయికతో రాజయోగం.. మారనున్న ఈ మూడురాశుల వారి జాతకం..!
Venus Transit | తులరాశిలో శుక్రుడి సంచారం.. మిథునరాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?
Shatanka Yogam | గురువు, శుక్రుడి సచారంతో శతంక యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!