Sun Transit | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు నెలానెలా తన ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు. ఈ మార్పునే సూర్య సంక్రాంతిగా పేర్కొంటారు. నవగ్రహాల్లో సూర్యుడి రాజుగా పేర్కొంటారు. ఆయనను ఆత్మ కారుకుడిగా చెబుతారు. జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే.. వ్యక్తులు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతుంది. నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశి పాలకగ్రహం అంగారకుడు. సూర్యుడిని రాశి మార్పు సమయంలో పలు రాశులవారిపై శుభ ప్రభావం చూపుతుంది. సూర్యుడి రాశి మార్పు కారణంగా ఏ రాశులవారికి అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం..!
సూర్యుడు మేషరాశి ఐదో ఇంటికి పాలకగ్రహం. సూర్యుడు ఎనిమిదో ఇంట్లో సంచరించనున్నాడు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కానీ, పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అద్భుతమైన విజయాలు చూస్తారు. సూర్యుడి రాశి మార్పు కారణంగా పూర్వీకుల ఆస్తి నుంచి గణనీయమైన లాభాలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి.
సూర్యుడు ఈ రాశి మూడో ఇంటికి పాలకగ్రహం. ఆరో ఇంట్లో సూర్యుడి సంచారం జరుగబోతున్నది. ఆరో ఇంట్లో, వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం కారణంగా మీలో ఉత్సాహం పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేపట్టినా మీకు విజయం వరిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కెరీర్, వ్యాపారంలో ప్రశంసలు పొందుతారు. వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం కారణంగా వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది.
సూర్యుడి కర్కాటకరాశి రెండో ఇంటికి పాలకగ్రహం. సూర్యుడి సంచారం ఐదో ఇంట్లో జరుగనున్నది. జాతకంలోని ఐదో ఇల్లు వృత్తి, పిల్లలకు ప్రతీకగా పేర్కొంటారు. సూర్యుడి సంచారం కారణంగా కెరీర్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. పనినిమిత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీకు ఈ సమయంలో ఉత్తమంగా ఉంటుంది.
Read Also :
“Budh Vakri | తిరోగమనంలో బుధుడు.. వృశ్చిక రాశి మినహా ఈ మూడురాశులవారు తస్మాత్ జాగ్రత్త..!”
“Navapancham Raja Yogam | శని, బుధుడి కలయికతో రాజయోగం.. మారనున్న ఈ మూడురాశుల వారి జాతకం..!”