Budh Gochar | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యానికి కారకుడిగా పేర్కొంటారు. బుధుడు నవంబర్ 27న వృశ్చిక రాశిలో ఉదయించనున్నాడు. ఈ సంచారం కారణంగా పలు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు ఉదయించడంతో దాని ప్రత్యేక ప్రభావం కెరీర్, వ్యాపారం, కమ్యూనికేషన్ప కనిపిస్తుంది. 12 రాశులపైనే కాకుండా దేశం, ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం ఉంటుంది. పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ క్రమంలో బుధుడి ఉదయించడం వల్ల ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నయో తెలుసుకుందాం..!
మేషరాశి వారికి సమయంలో కొత్త మార్పులు జరుగుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త ఎగ్జిక్యూటివ్స్‌తో కనెక్ట్ అవుతారు. ఈ సమయంలో రచనారంగంలో ఉన్న వారి జీవితంలో గణనీయమైన విజయాలు సాధిస్తారు. స్నేహితులతో ఉన్న విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. మీపై అందరిలో విశ్వాసం పెరుగుతుంది. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విజయాలు సాధించే అవకాశాలున్నాయి. మీ కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉంటుంది. పాత విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. మీరు కలకంటున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
తులరాశి వారు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లును కూడా కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సొంత వ్యాపారం చేసేవారంతా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు. ఈ సమయంలో రచన, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు అందరినీ ఆకర్షిస్తారు. సీనియర్ అధికారులు సైతం మిమ్మల్ని విశ్వసిస్తారు.
కుంభ రాశి జీవితంలో మార్పులుంటాయి. వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న వారంతా ఉపశమనం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తారు. ఈ సమయంలో కొత్త పని చేపడుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంది. ఊహించని ఆర్థిక లాభం ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తారు. దాంతో కెరీర్లో అద్భుతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు సైతం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు తోబుట్టువుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
Read Also :
Mahalakshmi Rajayogam | త్వరలో మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులవారుల వారి చేతికి డబ్బే డబ్బు..!