Shani Gochar | కొత్త ఏడాది పలురాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నది. ఎందుకంటే 2026లో శనిదేవుడు మూడు కీలకమైన నక్షత్రాల్లో సంచరించనున్నాడు. నవగ్రహాల్లో ఒకటైన శని న్యాయం, కర్మ, క్రమశిక్షణ, సాంకేతికత, సవాళ్లు, దీర్ఘాయువుకు కారకుడిగా పేర్కొంటారు. ఆయన అనుగ్రహం చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ, కొత్త సంత్సరంలో పలురాశులవారిని ప్రత్యేకంగా కటాక్షించనున్నాడు. దృక్ పంచాంగం ప్రకారం.. శని 2026లో మూడు నక్షత్రాల్లో సంచరించనున్నాడు. దాంతో పలురాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు ఉండనున్నాయి. మొదట శని జనవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తాడు. మే 17న రేవతి నక్షత్రంలో.. చివరగా అక్టోబర్ 7న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ మూడు మార్పులూ మీనరాశిలోనే జరుగుతాయి. శనిదేవుడి అత్యంత ప్రభావం మూడురాశులవారిపై ఉంటుంది. దాంతో ఉద్యోగం అకాశాలు, ఆరోగ్యం, జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి.
2026 సంవత్సరం కర్కాటకరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఆయన అనుగ్రహం ఈ రాశివారిపై ఉంటుంది. సంక్షోభాలు, ఇబ్బందుల నుంచి బయటపడుతారు. మీ ఆర్థిక పరిస్థితి ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ సంవత్సరం అవివాహితులకు కీలకంగా ఉంటుంది. సంవత్సరం ముగిసే లోపు వివాహం.. లేకపోతే సంబంధాలు కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ ప్రయత్నాలన్నీ ఫలప్రదమవుతాయి. పని చేసే చోట సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న స్నేహితులు, పరిచయస్తుల ద్వారా శుభవార్తలు వింటారు. దాంతో మీకు కెరీర్, ఆర్థిక సంబంధ ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులు ఈ ఏడాదిలో మాత్రం అప్పుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకుంటే భవిష్యత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించుకోవాలి.
సూర్యుడి సొంత రాశి అయిన సింహరాశి వారికి సైతం 2026 సంవత్సరంలో శనిదేవుడి ఆశీర్వాదం ఉంటుంది. ఏడాదంతా శని సానుకూల ప్రభావం ఉంటుంది. దాంతో అనేక రంగాల్లోని వారు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో ఉద్యోగరంగంలోని వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కృషి, పట్టుదల, మీ సత్ప్రవర్తన ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కెరీర్ పురోగతికి అవకాశాలుంటాయి. ఈ సంవత్సరం మధ్యలో, చివరి నాటికి ప్రమోషన్ పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు ఈ సంవత్సరం పెట్టుబడి, విస్తరణ అంశాల్లో స్థిరత్వం ఉంటుంది. ఇల్లు, వాహనం, ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం. శని స్థానం ఆయా నిర్ణయాల్లో మీకు విజయాన్ని కట్టబెడుతుంది. అయితే, ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు సంబంధాల్లో చీలికకు దారి తీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
శనైశ్చరుడి ప్రభావంతో 2026 సంవత్సరంలో మీనరాశి వారికి సమత్యులత, బాధ్యత, సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అవగాహన ఉంటుంది. భావోద్వేగాలు సంబంధాలు మరింత బలపడుతాయి. ఈ సంవత్సరం మీరు సుదీర్ఘ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. దాంతో మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. భాగస్వామ్య వ్యాపారరంగంలో ఉనన వారికి సైతం కొత్త ఏడాది శుభపద్రంగా ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రాజెక్టులపై లాభాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆస్తి, వ్యాపార అవకాశాల్లో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. బయట తినడం వల్ల మీ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. కడుపు సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
Read Also :