Moon Transit | చంద్రుడు సోమవారం మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించాడు. చంద్రుడిని భావోద్వేగాలు, వైఖరులు, మానసిక స్థితికి కారకంగా పేర్కొంటారు. చంద్రుడి రాశి మార్పు భావోద్వేగ మార్పులు మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో అనేక అంశాలను సైతం ప్రభావితం చేస్తుంది. చంద్రుడి సంచారం ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితిలో మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. పలురాశుల వారి వృత్తిపరమైన జీవితాల్లో ఆశించిన విజయాలను చూస్తారు. డబ్బు, ఆస్తులకు సంబంధించిన విషయాల్లోనూ సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. మానసికంగా, భావోద్వేగపరంగా ఉత్సాహం, విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో చిన్న, పెద్ద మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీకు శాశ్వత ప్రయోజనాలు అందించే అవకాశం ఉంది. చంద్రుడి సంచారం కారణంగా ఏ రాశుల వారికి ప్రయోజనం ఉండబోతుందో తెలుసుకుందాం..!
మేషరాశిలో చంద్రుడి సంచారం కారణంగా ఆరోగ్యం మెరుగవుతుంది. పని చేసే చోట మీ ప్రయత్నాలను ప్రశంసిస్తారు. కొందరికి కోరుకున్న ఉద్యోగం లేదంటే బాధ్యతలు స్వీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. చంద్రుడి ఏడో కోణం వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. సానుకూల మార్పులు ఉంటాయి. మెరుగైన వైవాహిక జీవితం గడుపుతారు. అవివాహితులకు పెళ్లి అయ్యే సూచనలున్నాయి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి ప్రయోజనాలుంటాయి.
కర్కాటక రాశి వారికి చంద్రుడి సంచారం కారణంగా కెరీర్, విద్య రంగాల్లో శుభ సంకేతాలుంటాయి. ఈ నెల ప్రారంభంలో శుభవార్తలు వింటారు. పని చేసేచోట మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉపకరిస్తాయి. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలుంటాయి. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది. పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
మకర రాశి వారికి చంద్రుడి సంచారం వారి కలలు, ఆశయాలను నెరవేర్చుకుంటారు. ఇల్లు, వాహనం కొనాలని ఆలోచిస్తుంటే.. మీకు ఇది శుభసమయంగా నిలుస్తుంది. స్నేహితులు, సహోద్యోగుల మద్దతు కార్యాలయంలో విజయం సాధిస్తారు. మీడియా, అమ్మకాలు, కళలలో పాల్గొన్న వారు ఆర్థిక లాభాలు చూస్తారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగవుతుంది. సంబంధాల్లోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి.
Read Also :
Shani-Budh Margi | ప్రత్యక్షంగా సంచరిస్తున్న శని-బుధ గ్రహాలు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!
Rahu Transit | శతభిష నక్షత్రంలోకి రాహువు.. ఈ మూడురాశుల వారి తలుపుతట్టనున్న అదృష్టం..!