Mars Transit | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులతో పాటు నక్షత్రాలను మార్చుకుంటాయి. కుజుడు ఈ నెల 12న మూల నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారంతో మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. పలు రాశులవారికి కుజుడి సంచారంతో శుభపద్రంగా ఉండనున్నది. కుజుడు తన శక్తితో ఆయా రాశుల అదృష్టాన్ని, పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించనున్నాడు. కుజుడి సంచారంతో పలు రాశుల్లో జన్మించిన జాతకుల వారి జీవితాల్లో కొత్త సానుకూల శక్తిని తీసుకురానున్నది. దాంతో వారి సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. అదృష్టంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లోనూ విజయం సాధిస్తారు.
మేషరాశి వారికి కుజుడి సంచారంతో చాలా శుభ ఫలితాలుంటాయి. ఈ సమయంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఇల్లు లేదంటే వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఇది అనుకూలమైన సమయం. సోమరితనం, బద్దకం తొలగిపోతాయి. మీ పనులన్నీ పూర్తి శక్తి, ఉత్సాహంతో పూర్తి చేస్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు విజయం సాధించడానికి వీలుంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ సమయం మీకు ప్రోత్సాహకరంగా, ప్రయోజనకరంగా నిలుస్తుంది.
కుజుడి సంచారం వృశ్చిక రాశి వారికి ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురానున్నది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది. తద్వారా గణనీయంగా విజయాలు సాధిస్తారు. మీకు ఎదురయ్యే సవాళ్లన్నీ సులభంగా ఎదుర్కొంటారు. క్లిష్ట సమస్యలన్నీ తేలిగ్గా పరిష్కారమవుతాయి. ఈ సమయం మీకు అన్నిరకాలుగా కలిసి వస్తుంది. తద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది.
మకర రాశి వారికి సైతం కుజగ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఖర్చులను నియంత్రించుకోవడంతో పాటు డబ్బులను ఆదా చేస్తారు. కుజుడిసంచారంతో మీ కుటుంబంలోని విభేదాలన్నీ ముగిసిపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త ఆదాయ వనరులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. మీ జీవితం స్థిరంగా ఉంటుంది. కుజగ్రహ సంచారం కారణంగా ఆనందం, శ్రేయస్సు చేకూరడంతో పాటు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు.
Read Also :
“Labh Drishti Yoga | త్రికేదశ యోగం.. ఈ మూడురాశుల వారికి డబ్బే డబ్బు..!”