Jupiter Transit | జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ నెల 4న బృహస్పతి తన రాశిని మార్చుకోనున్నాడు. రాత్రి 8.39 గంటలకు కర్కాటక రాశి నుంచి మిథునరాశిలో తిరోగమనంలో ప్రవేశిస్తాడు. ఈ సంచారం అన్నిరాశులవారిపై ఉంటుంది. బృహస్పతి జ్ఞానం, అదృష్టానికి సంకేతంగా పేర్కొంటారు. జాతకంలో గురువు స్థానం వైవాహిక జీవితం, విద్యపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. గురువు సంచారం మారినప్పుడల్లా ప్రభావం సాధారణం కంటే చాలా రెట్లు పెరుగుతుంది. బృహస్పతి మిథునరాశిలో తిరుగోమనంలో ఉండడంతో పలురాశులవారిపై నిర్దిష్ట ప్రభావం పడుతుంది. దాంతో ఆయా రాశులవారు నిర్ణయం తీసుకునే సామర్థ్యంలో మార్పులు, కెరీర్లో విజయం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
గురువు సంచారం కారణంగా వృషభ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. పిల్లల ఆనందం, వైవాహిక జీవితంలో ఆనందం, విద్యారంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. సేల్స్, మార్కెటింగ్, రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు జీవితంలో ముందుకు సాగేందుకు సరికొత్త అవకాశాలను అందుకుంటారు. జీవితంలో శ్రేయస్సుతో పాటు స్థిరత్వం వస్తుంది. గురువు ప్రభావంతో చాలాకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగవంతమవుతాయి. కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల నుంచి మంచి మొత్తంలో డబ్బును పొందుతారు. కొత్త పనులు చేపడుతారు.
ఈ సమయంలో మిథునరాశి వారు మార్పులు చూస్తారు. గురువు ప్రభావంతో మీ జ్ఞానం పెరుగుతుంది. విద్యారంగంలోని వారికి కెరీర్ను ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త దిశను అందిస్తుంది. విద్యార్థులు కోరుకున్న కళాశాల, కోర్సుల్లో చేరుతారు. వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలతో ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో జీవితంలో ఆనందం వెల్లివిరిసే అవకాశాలో గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. దాంతో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త మార్గాలను కనుగొట్టారు. దాంతో మీ జీవితం సాఫీగా ఉంటుంది.
సేల్స్, మీడియా, కోచింగ్, సంగీతం తదితర రంగాల్లో ఉన్న సింహరాశి జాతకులకు ఈ సమయంలో భారీ ప్రయోజనాలు కలుగుతాయి. మీరు చేసే ప్రయత్నాలతో విజయం వరిస్తుంది. గురు సంచారం కారణంగా చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరుతాయి. దాంతో మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పాత స్నేహితులు, మిత్రులను మళ్లీ కలుసుకుంటారు. వారితో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో మీ జాతకమే మారుతుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా మీరు విజయం సాధిస్తారు.
Read Also :
“Shani-Budh Margi | ప్రత్యక్షంగా సంచరిస్తున్న శని-బుధ గ్రహాలు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!”