న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.32 వేల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మోదీ ప్రభుత్వ పదేండ్ల రికార్డును పరిశీలిస్తే ఈ తొమ్మిది నెలల్లో అటాచ్ చేసిన భూమి, ఆస్తులు విలువ 8 రెట్లు ఎక్కువ. ఈ క్రమంలో పలు కంపెనీలపై ఈడీ చర్యలు చేపట్టింది.
అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన సుమారు రూ.5,600 కోట్ల విలువైన ఆస్తులు, క్రిప్టో కరెన్సీ మోసంలో రూ.4,190 కోట్ల విలువైన ఆస్తులు, పెర్ల్ గ్రూప్ పోంజీకి చెందిన రూ.3436 కోట్ల ఆస్తులు, యునైటెడ్ రియల్ ఎస్టేట్‌కు చెందిన రూ.1000 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది.
ఇది గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 141 శాతం ఎక్కువ ఆస్తులను అటాచ్ చేశారు. ఈడీ ఇప్పటి వరకు మొత్తం రూ.1.55 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇది కేంద్ర హోం శాఖ ఒక సంవత్సరం బడ్జెట్‌కు సమానం. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ఎఫ్డీలు, షేర్లు, విలువైన లగ్జరీ కార్లు, బ్యాంకు ఖాతాలు, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఉన్నాయి.