జెన్-జీ బంధానికి.. జపాన్ పాఠాలు!
జెన్-జీ జంటల మధ్య బంధాలు ఎంత త్వరగా ముడి పడుతున్నాయో.. అంతే త్వరగా విడిపోతున్నాయి.ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అవగాహన లోపాలు, డిజిటల్ ఇంట్రూషన్, అపరిమిత స్వేచ్ఛ.. అన్నీ కలిసి నూరేళ్ల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి.
జెన్-జీ జంటల మధ్య బంధాలు ఎంత త్వరగా ముడి పడుతున్నాయో.. అంతే త్వరగా విడిపోతున్నాయి.ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అవగాహన లోపాలు, డిజిటల్ ఇంట్రూషన్, అపరిమిత స్వేచ్ఛ.. అన్నీ కలిసి నూరేళ్ల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇలా విడిపోతున్న జంటలకు కొన్ని జపనీస్ టెక్నిక్స్ అద్భుతమైన పరిష్కారం చూపుతున్నాయి. వారిలో మానసిక ప్రశాంతతను పెంచి.. బంధాలు మళ్లీ బలపడేలా చేస్తున్నాయి.

షిన్రిన్-యోకు: జెన్-జీ జంటలు ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపాలని అంటున్నది షిన్రిన్-యోకు. దీనికే ‘ఫారెస్ట్ బాతింగ్’ అని పేరు. పచ్చని చెట్లు, మొక్కల మధ్య నడవడం వల్ల.. శరీరంలోని ఒత్తిడి హార్మోన్ అయిన కోర్టిసోల్ తగ్గుతుందట. అందుకే, మీ భాగస్వామితో కలిసి పార్కులో, పచ్చని చెట్ల మధ్య మార్నింగ్ వాక్ కోసం వెళ్లండి. ఈ నడక.. ఇద్దరి మధ్య బంధాన్ని బలపర్చడంతోపాటు మనసునూ తేలికపరుస్తుంది. వారంతాల్లో పనిగట్టుకొని ఎక్కడికైనా వెళ్లి… ఓ రెండు రోజులు హాయిగా సేదతీరి రండి.

వబి-సబి: ఏ మనిషీ సంపూర్ణుడు కాదు. అలాగే, ఏ సంబంధమూ లోపాలు లేకుండా ఉండదు. అందుకే, అసంపూర్ణతలోని అందాన్ని వెతకాలని సలహా ఇస్తున్నది వబి-సబి టెక్నిక్. బంధంలోని చిన్నచిన్న లోపాలు, విభేదాలను అంగీకరించడం నేర్చుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, అన్నీ అనుకూలంగా ఉండాలి అనే ధోరణి తగ్గించుకోవాలి. ఎదుటివారిలో లోపాలు ఎంచడం కన్నా.. మీలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.
కించుగి: భార్యభర్తలు అన్నాక.. గొడవలు సహజం. మనసుల్ని గాయపర్చుకోవడమూ సహజమే! మళ్లీ కలిసినప్పుడు పాత గాయాల్ని రేపుకోవడం మానేయండి. వాటినుంచి నేర్చుకున్న పాఠాలతో.. మీ బంధాన్ని మరింత బలంగా తయారు చేసుకోండి. అదే.. కించుగి టెక్నిక్. పగిలిన వస్తువులను అతికించి, అలంకరిస్తే.. మరింత అందంగా తయారవుతుంది కదా! గొడవ సద్దుమణిగిన తర్వాత… మళ్లీ మాటలు కలిపినప్పుడు ‘అప్పడు అలా ఎందుకన్నావు’ అని సాగదీయకుండా.. చిరునవ్వుతో
మాట కలపండి.

కాన్సెన్: ఎదుటివారు చెప్పేది ఏకాగ్రతతో వినడమే.. కాన్సెన్! నిజానికి చాలా సంబంధాలు చెడిపోవడానికి అసలు కారణం.. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే! కాబట్టి, భాగస్వామి గురించి ముందే తీర్పు ఇవ్వడం మానేయండి. వారు చెప్పేది పూర్తి శ్రద్ధతో వినడం అలవాటు చేసుకోండి. ఇది.. ఎదుటివారిలోని అపార్థాలను తొలగిస్తుంది. ప్రశాంతతను
అందిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

