హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ కే రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడే భేటీ అయ్యారు. బుధవారం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులు లోక్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తిచేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల పలు రాష్ర్టాలకు కేంద్ర ప్ర భుత్వం కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసింది.