Venus Asta | వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుకుంటాయి. అదే సమయంలో ఉదయిస్తూ.. అస్తమిస్తుంటాయి. ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చిన సమయంలో అది కనిపించకుండా పోతుంది. భూమిని నుంచి కనిపించదు. ఎందుకంటే సూర్యుడి కాంతిలోనే అంతర్ధానమవుతుంది. దీన్నే జ్యోతిషశాస్త్రం పరంగా అస్తమయంగా పిలుస్తారు. శుక్రుడు డిసెంబర్ 11న అస్తమించాడు. ఇది 2026 ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉంటుంది. శుక్రుడి అస్తమయంతో జీవితంలో ఆనందం, ప్రేమ, సంపద, వైవాహిక సంబంధాలపై ప్రత్యక్షంగా ప్రభావం కనిపిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు అస్తమయంతో పలురాశులు ప్రభావితమవుతాయి. కానీ, కొందరికి ప్రత్యేకంగా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం..!
శుక్రుడు అస్తమించడం వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకునేందుకు అంకితభావంతో పని చేస్తారు. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారు విజయాలు సాధిస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబంలో ఆనందం, సంతృప్తికర వాతావరణం కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో సామరస్యం పెరిగి బంధం మరింత బలపడుతుంది. మీరు ఓ ప్రాజెక్టులో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గతంలో ఆగిపోయిన ప్రణాళికలన్నీ మళ్లీ ప్రస్తుతం ఊపందుకుంటాయి. జీవితంలో సానుకూల మార్పులు కలిగే అవకాశాలున్నాయి.
శుక్రుడి అస్తమయంతో తులరాశి వారికి సైతం శుభం జరుగుతుంది. ఈ సమయంలో వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు మరింత మధురంగా ఉంటాయి. మీకు ప్రియమైన వ్యక్తులతో ప్రత్యేక సమయాన్ని గడుపుతారు. మీ బంధాలు మరింత బలోపేతమవుతాయి. సామాజిక సంబంధాలు పెరిగి.. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనిలో సానుకూల ఫలితాలుంటాయి. దాంతో వృత్తిపరంగా ఎంతో పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులను తీర్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారం కోసం చేసే పర్యటనల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దాంతో మీ కెరీర్‌కు కొత్త దిశగా నిలుస్తుంది.
శుక్రుని అస్తమయం మకరరాశి వారికి ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులతో లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితం ఆనందం, సంతృప్తికరంగా ఉంటుంది. వైవాహిక సంబంధాల్లో సానుకూల మార్పులు కూడా సాధ్యమే. ఆనందాన్ని కలిగించే వార్తలు వింటారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ సానుకూల ఫలితాలు వస్తాయి. భవిష్యత్‌పై నమ్మకంగా ముందుకు సాగేందుకు మీకు వీలు కలుగుతుంది.
Read Also :
Rahu-Ketu Transit | కొత్త ఏడాదిలో రాహు-కేతువుల సంచారం.. ఈ రాశులవారికి అన్నీ సమస్యలే..!