Rahu-Ketu Transit | రాహువు-కేతువుల ప్రభావం కొత్త ఏడాదిలో గణనీయంగా కనిపించనున్నది. ఈ రెండు గ్రహాలు రాశిచక్రాలు, నక్షత్రాలను మార్చుకునే సమయంలో అదృష్టాన్ని తీసుకురానున్నది. అదే సమయంలో సమస్యలు సైతం పెరుగుతాయి. కొత్త సంవత్సరంలోని మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. నవంబర్ 25న అశ్లేష నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 5న కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తూ.. ఆగస్టు 2న ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5న రాహువు కుంభరాశిలో నుంచి మకరరాశిలోకి వెళ్తాడు. రాహువు కేతువు సంచారం ఈ రాశుల్లో జన్మించిన వారి సమస్యలు పెరుగుతాయి.
కొత్త ఏడాదిలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్లో, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి. వ్యాపారరంగంలో ఉన్న వారికి అకస్మాత్తుగా మందగిస్తుంది. రాహువు-కేతువుల ప్రభావం ప్రభావం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగులు ఆకస్మిక మార్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో వారి రోజువారీ పనులు ప్రభావితమవుతాయి. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో అసహనం పనికిరాదు. కొత్త ఆదాయ వనరులు చేతికందుతాయి. వ్యాపారవేత్తలు కష్టపడాల్సి ఉంటుంది. కోరుకున్న లాభాలను సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. లేకపోతు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
వృషభ రాశి ఇంట్లో, వెలుపల సమతుల్యం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన మద్దతు, సహకారం లభించదు. దాంతో నిరాశకు గురవుతారు. ఈ సమయంలో పెట్టుబుడులు పెడితే ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. అదే సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలని భావిస్తున్న వారు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగరంగంలో ఉన్న వారు బదిలీ జరిగే అవకాశం ఉంది. పనుల్లో విజయం సాధించకపోవడం వల్ల విశ్వాసాన్ని కోల్పోతారు. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందులు మరింత పెరుగుతాయి.
కన్యారాశి వారికి మళ్లీ పాత వివాదాల్లో చిక్కుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు కేసులతో మళ్లీ ఇబ్బందులు పడే అవకాశాలో గోచరిస్తున్నాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఏడాది కొత్త సంబంధాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. దాంతో గణనీయమైన నష్టాలను చూసే ఛాన్స్ ఉంది. అలాగే, డబ్బును దుబారా చేయడం మానుకోవాలి. ఎందుకంటే బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో తొందర పనికిరాదు. ఆరోగ్యకరమైన దినచర్య, ఆహారంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు పనిభారాన్ని పెంచుకుంటారు. పదోన్నతి కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం మంచిది.
Read Also :
Mars Transit | మూల నక్షత్రంలోకి కుజుడు.. ఈ మూడురాశుల వారికి జిడ్డులా పట్టబోతోన్న అదృష్టం..!