Bigg Boss 9 | బిగ్‌బాస్ డే 97 ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతోనే హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా మొదలైంది. “సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు… మరి శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం” అంటూ షోను ఓపెన్ చేసిన నాగ్, కంటెస్టెంట్లను కూర్చోబెట్టి ఇమ్యూనిటీ విషయంపై క్లారిటీ అడిగారు. 14వ వారం ఇమ్యూనిటీని ఎందుకు శాక్రిఫైజ్ చేస్తావ్ అని కళ్యాణ్ సీరియస్ అవ్వడంతో వాతావరణం వేడెక్కింది. “మేము గెలిస్తే ఇవ్వడానికి నీ దగ్గర 3 లక్షలు లేవా?” అంటూ ప్రశ్నించడంతో తనూజ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. లీడర్ బోర్డులో టాప్‌లో ఉన్న తనూజాను అభినందించిన నాగార్జున, “రీతూ వెళ్లిపోయాక నువ్వు బెటర్ అయ్యావు” అని చెప్పగా, డెమోన్ “ఈ వారం బాగా ఎంజాయ్ చేశాను సార్” అని స్పందించాడు.
దాంతో “బయటకు వెళ్లాక దొరికిపోతావ్” అంటూ నాగ్ సరదాగా కామెంట్ చేయగా హౌస్‌లో నవ్వులు పూశాయి. తర్వాత రెడ్–గ్రీన్ ఫ్లాగ్స్ టాస్క్‌లో ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉందనేది బయటపడింది. సంజన తనూజాకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి ఇమ్మాన్యుయేల్‌ను గ్రీన్‌గా చూపించగా, భరణి సుమన్‌కు గ్రీన్ ఇచ్చాడు. డెమోన్ గ్రీన్ ఇమ్మూ, రెడ్ భరణికి ఇచ్చాడు. కళ్యాణ్ తనూజాను గ్రీన్‌గా, పవన్‌ను రెడ్‌గా పేర్కొనగా, ఇమ్మాన్యుయేల్ సంజనకు గ్రీన్, భరణికి రెడ్ ఇచ్చాడు. ఈ టాస్క్ వల్ల విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 5 లక్షలు కట్ అవుతాయని నాగ్ చెప్పగానే తనూజ “నాకొద్దు… అందరం దానికోసమే కష్టపడ్డాం” అంటూ స్పష్టంగా చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది. మొత్తంగా ఎక్కువ ట్రస్ట్ ఇమ్మాన్యుయేల్‌కు, తక్కువ ట్రస్ట్ భరణి, డెమోన్లకు దక్కింది.
అనంతరం బిగ్‌బాస్ స్టేజ్‌పై ఊహించని అతిథిగా ‘ఇండియన్ పాప్ స్మితా’ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కొత్త ఆల్బమ్‌తో వరల్డ్ టూర్ చేయనున్నట్టు వెల్లడించగా, నాగార్జునతో కలిసి ప్రోమో లాంచ్ చేశారు. ఎక్స్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ నోయెల్ ర్యాప్ చేయగా, ‘నా సామిరంగా’ దర్శకుడు విజయ్ బిన్నీ మాస్టర్ ఈ వీడియోను రూపొందించారు. లైవ్ పెర్ఫార్మెన్స్తో షో మరింత కలర్ఫుల్గా మారింది.చివర్లో రిగ్రెట్ టాస్క్‌లో కంటెస్టెంట్లు తమకు నచ్చని వారాలను గుర్తు చేసుకున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. చివరికి శనివారం ఎలిమినేట్ అయ్యింది సుమన్ శెట్టి. మరో ఎలిమినేషన్ ఆదివారం ఉండనుండటంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సుమన్ శెట్టి ఎలిమినేషన్‌కి కారణం సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం , ఎక్కువగా భరణిపై ఆధారపడటం సుమన్‌ని దెబ్బ కొట్టిందని, అదే ఎలిమినేషన్‌కి కారణమని బిగ్ బాస్ బజ్‌లో శివాజీ చెప్పడం విశేషం.