హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుభి వాగు(Dundubhi river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. 200 గొర్లతో సహా ఇద్దరు గొర్ల కాపరులు(Shepherds) దుండిభి వాగులో చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా బైక్పై వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చ రించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికా రులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల కారణంగా రేపు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.