Lashkar-e-Taiba: ప్రముఖ ఆలయాలు, ఎర్రకోట టార్గెట్.. పేలుళ్లకు లష్కరే ప్లానింగ్ !
Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా( Lashkar-e-Taiba) ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. దేశరాజధాని చాందినీ చౌక్‌లో ఉన్న ఓ ఆలయం వద్ద కూడా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు భద్రతా వర్గాల ద్వార తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన మసీదు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది.
ఇస్లామాబాద్ మసీదు పేలుడు ఘటనలో 31 మంది మరణించగా, 160 మంది గాయపడ్డారు. పాక్ పేలుడు ఘటనకు తామే కారణం అని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించుకున్నది. గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది మరణించారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్ ఉమర్ నబీ కారులో ఆత్మహుతికి పాల్పడ్డాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

