MS Dhoni : భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన వాళ్లు చాలామందే. ఈ కాలంలో చూస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు సహచరులుగా. సారథులుగా టీమిండియాను అగ్రస్థానాన నిలిపారు. వీళ్లిద్దరూ దేశం గర్వించదగ్గ కెప్టెన్లు మాత్రమే కాదండోయ్ అత్యంత సన్నిహితులు కూడా. ధోనీపై తన ఆరాధన భావాన్ని కోహ్లీ పలు సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా కోహ్లీతో బంధంపై ధోనీ తాజాగా స్పందించాడు.
‘మేమిద్దరం 2008-09 నుంచి కలిసి ఆడుతున్నాం. మా మాధ్య వయసు అంతరం నిజమే. అందుకని నేను విరాట్‌కు నేను ఏమి అవుతాను? అంటే ఫలానా అని కచ్చితంగా చెప్పలేను. అతడికి నేను పెద్ద అన్న లేదా సహచరుడు.. ఇలా మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ, ఫలానా అని మాత్రం చెప్పేలేను. మేమిద్దరం దేశం తరఫున చాలా ఏండ్లు ఆడాం. ప్రపంచ క్రికెట్లో విరాట్ అత్యుత్తమ ఆటగాడు’ అని ధోనీ వెల్లడించాడు.
Dhoni and ViratKohli relationship ❤️
– The Mahirat duo! 💥
Dhoni #ViratKohli
#ThalaDharisanam #IPLonJioCinema TATAIPL#Rohitsharma #Msd pic.twitter.com/Ov0iVvyYh2— SubashMV (@SubashMV5) August 31, 2024
ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన విరాట్ చివరకు అతడి నుంచే సారథిగా పగ్గాలు అందుకున్నాడు. ధోనీతో కలిసి 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కోహ్లీ భాగమయ్యాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత ధోనీ వీడ్కోలు పలకగా.. కోహ్లీ భారత కెప్టెన్‌గా శిఖరాలకు చేరాడు. అంతేకాదు టీమిండియాకు ఆడినన్ని రోజులకే పరిమితం కాకుండా.. ఆ తర్వాత కూడా మహీతో అనుబంధాన్ని కొనసాగించాడు. ప్రస్తుతం ఇద్దరూ ఐపీఎల్లో తమదైన ఆటతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐదు టైటిళ్లు గెలుపొందగా.. కోహ్లీ మాత్రం ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.