Dwayne Bravo : వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) పొట్టి ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పటికే వన్డేలకు, టెస్టులతో పాటు ఐపీఎల్ నుంచి వైదొలిగిన బ్రావో ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఆడుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL) తన టీ20 కెరీర్లో ఆఖరిదని తేల్చేశాడు. ప్రపంచంలోనే మేటి ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన వీడ్కోలు నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. నా క్రికెట్ కెరీర్లో ఇది నిజంగా గొప్ప ప్రయాణం అని బ్రావో అన్నాడు.
‘ఇది నిజంగా గొప్ప జ్నీ. ఈ రోజుతో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నా. ఇదే నా ఆఖరి సీపీఎల్. నా కరీబియన్ జనం ముందు చివరి టోర్నమెంట్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఎక్కడైతే నా కెరీర్ మొదలైందో.. అక్కడే కెరీర్ ముగిస్తున్నాను’ అని బ్రావో తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం సీపీఎల్‌లో బ్రావో ట్రిన్బగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) జట్టుకు ఆడుతున్నాడు.
వెస్టిండీస్ తరఫున రెండు టీ20 వరల్డ్ కప్‌లు గెలుపొందిన బ్రావో ఐపీఎల్లో అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్రాంచైజీలకు ఆడిన అతడు అత్యధిక వికెట్ల వీరుడిగా పేరొందాడు. అయితే.. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు బ్రావో 2023లో వీడ్కోలు పలికాడు.
ఎంఎస్ ధోనీతో బ్రావో
ఐపీఎల్లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ 161 మ్యాచ్‌లు ఆడి.. 183 వికెట్లు తీశాడు. 1,560 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతను 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ప్రస్తుతం బ్రావో అఫ్గనిస్థాన్ జట్టు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Mammootty | అంతిమంగా సినిమా బతకాలి.. హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన మమ్ముట్టి
Heavy rains | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మన్ననూర్ చెక్ పోస్ట్ మూసివేత
Kisan credit card | ఆ మహిళలకు ఒక్కొక్కరికి రూ.1.62 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
KC Tyagi | పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి.. జేడీ(యూ) సీనియర్ నేత రాజీనామా