దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య
తెలుగు సినీదర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. వీఎన్ ఆదిత్య, సాయిరాజేష్ ప్యానల్, వీరశంకర్ ప్యానల్, మద్దినేని రమేష్, కస్తూరి శ్రీనివాస్ ప్యానల్ ఈ ఎన్నికల్లో తలపడగా.. వీఎన్ ఆదిత్య ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది.
తెలుగు సినీదర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. వీఎన్ ఆదిత్య, సాయిరాజేష్ ప్యానల్, వీరశంకర్ ప్యానల్, మద్దినేని రమేష్, కస్తూరి శ్రీనివాస్ ప్యానల్ ఈ ఎన్నికల్లో తలపడగా.. వీఎన్ ఆదిత్య ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. నూతన అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య ఎంపికయ్యారు. వి.సముద్ర, జర్నలిస్ట్ ప్రభు, ఎస్వీ భాస్కర్‌రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల రామారావు, కోశాధికారిగా దర్శకుడు సాయిరాజేష్ ఎన్నికయ్యారు.
ఫలితాల అనంతరం నూతన అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ‘దర్శకుల సంఘం అధ్యక్షునిగా నన్ను ఎంచుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. మా ప్యానల్లో 18మంది పోటీ చేస్తే, 16మంది గెలవడం ఆనందంగా ఉంది. చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తాం. అసోసియేషన్ సభ్యుల అరోగ్య భద్రతే ఈ నూతన కమిటీ ప్రధాన కర్తవ్యం’ అని చెప్పారు. ఎన్నికైన అభ్యర్థులను పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

