ముంబై: ఒక వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అతడ్ని తనిఖీ చేస్తున్న సమయంలో ప్యాంటు జేబులో డ్రగ్స్ ఉంచారు. (Cops Planting Drugs On Man) ఆ వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించి అదుపులోకి తీసుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న సాయంత్రం వేళ కలీనా ప్రాంతంలోని బహిరంగ స్థలంలో ఉన్న షెడ్లో డేనియల్ కూర్చొని ఉన్నాడు. యాంటీ-టెర్రర్ సెల్‌కు చెందిన నలుగురు పోలీసులు అతడి వద్దకు వచ్చారు. డేనియల్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించారు. తనిఖీ పేరుతో అతడి ప్యాంటు జేబును ఒక పోలీస్ వెతికాడు. ఈ సందర్భంగా 20 గ్రాముల మెఫెడ్రోన్‌ను ఆ వ్యక్తి ప్యాంటు జేబులో ఉంచారు. అతడి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించిన పోలీసులు డేనియల్ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ స్థలం వద్ద ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో జోన్ 6 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాజ్‌తిలక్ రోషన్ ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు ఆ ఖాళీ ప్లాట్‌కు సంబంధించి వివాదం ఉందని డేనియల్ అనుచరుడు తెలిపాడు. ఈ నేపథ్యంలో బిల్డర్ సూచన మేరకు స్థానిక పోలీసులు డేనియల్ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారని అతడు ఆరోపించాడు.
𝗣𝗼𝗹𝗶𝗰𝗲𝗺𝗲𝗻 𝗽𝗹𝗮𝗻𝘁 𝗱𝗿𝘂𝗴𝘀 𝗼𝗻 𝗮𝗻 𝗶𝗻𝗻𝗼𝗰𝗲𝗻𝘁 𝗺𝗮𝗻 | CCTV captures the deceit of Mumbai police officers, as they are seen putting a packet of drugs into the pocket of the man and arresting him. Investigations have begun against these officers. pic.twitter.com/d4O4fL4FUV
— MUMBAI NEWS (@Mumbaikhabar9) August 31, 2024