Team India | విమానంలో టీమ్ఇండియా సెలబ్రేషన్స్.. రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూశారా.. VIDEO
Team India | టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సాధించి విశ్వవిజేతగా నిలిచిన రోహిత్ సేన ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది.
Team India | టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సాధించి విశ్వవిజేతగా నిలిచిన రోహిత్ సేన ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది. మ్యాచ్ అనంతరం బెరిల్ హరికేన్ తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన రోహిత్ సేన.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అయితే, ఈ ప్రయాణంలో టీమ్ఇండియా ప్లేయర్స్ టీ20 గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ (BCCI) తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. ట్రోఫీతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లు సైతం ట్రోఫీతో ఫొటోలు దిగుతూ గెలుపును సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Travelling with the prestigious 🏆 on the way back home! 😍
🎥 WATCH: #TeamIndia were in excellent company during their memorable travel day ✈️👌 – By @RajalArora #T20WorldCup pic.twitter.com/0ivb9m9Zp1
— BCCI (@BCCI) July 4, 2024
ముంబైలో విజయోత్సవ ర్యాలీ
ఉదయం 11 గంటలకు రోహిత్ సేన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్‌లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
Also Read..
Team India | వీరులొచ్చేశారు.. ఢిల్లీలో రోహిత్ సేనకు ఘనస్వాగతం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

