T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో సూర్య క్యాచ్‌పై వివాదం.. షాక్ నుంచి తేరుకోలేకపోతున్న సఫారీ ఫ్యాన్స్!
వెస్టిండీస్ వేదికగా ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌యాదవ్ సంచలన క్యాచ్ వివాదం అవుతూనే ఉన్నది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ కండ్లు చెదిరే రీతిలో పట్టిన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
- బౌండరీలైన్ తాకినట్లు సఫారీ ఫ్యాన్స్ వీడియో
- ఖండించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ పొల్లాక్
T20 World Cup | బార్బడోస్: వెస్టిండీస్ వేదికగా ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌యాదవ్ సంచలన క్యాచ్ వివాదం అవుతూనే ఉన్నది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ కండ్లు చెదిరే రీతిలో పట్టిన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్న సఫారీలు మిల్లర్ ఔట్‌తో హతాశులయ్యారు. ఫైనల్ ముగిసి ఐదు రోజులవుతున్నా.. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
ఆ జట్టు ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ ఫలితాన్నే మార్చిన సూర్య క్యాచ్‌ను వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బెన్ కర్టిస్ అనే దక్షిణాఫ్రికా అభిమాని సూర్య క్యాచ్ వీడియోను జూమ్‌లో చూపిస్తూ..స్పష్టంగా కాలు బౌండరీలైన్‌కు తాకుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసి కామెంట్ చేశాడు. ‘సూర్య క్యాచ్‌ను వివిధ కోణాల్లో పరిశీలించాల్సింది. అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తున్నది’ అని రాసుకొచ్చాడు. దీనికి ఓ ఇంగ్లండ్ ఫ్యాన్ కూడా వంతపాడాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొల్లాక్ మాత్రం వేరేలా స్పందించాడు. ‘క్యాచ్‌లో ఎలాంటి లోపం లేదు. బౌండరీ లైన్ మారినా కుషన్‌కు అతని కాలు తాకలేదు. అద్భుతమైన నైపుణ్యం’ అంటూ రాసుకొచ్చాడు. సూర్య సూపర్ క్యాచ్‌ను అభినందించాల్సింది పోయి లోపాలు ఎందుకు వెతకడం అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

