‘ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
బెంగళూరులో ఈ నెల 22 నుండి 26 వరకు జరిగే ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం...
– ఈ 22న బెంగళూరులో భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ
– జిల్లా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
రామగిరి, నవంబర్ 21 : బెంగళూరులో ఈ నెల 22 నుండి 26 వరకు జరిగే ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ 22న బెంగళూరులో భారీ కార్మిక ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు దేశ వ్యాప్తంగా కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని, నల్లగొండ జిల్లా నుంచి కూడా కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభలో పాల్గొనాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కనీస వేతన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Maths | కొందరు పిల్లలు చిన్నతనం నుంచే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు, కొందరు ఉండరు.. ఎందుకు..?
Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

