వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది పూర్తి చిత్తశుద్ధితో పని చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటిరత్నం అన్నారు. శనివారం ఆమె పెన్‌పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని...
– పెన్‌పహాడ్ పీహెచ్సీ ఆకస్మీక తనిఖీ
పెన్‌పహాడ్, నవంబర్ 21 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది పూర్తి చిత్తశుద్ధితో పని చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటిరత్నం అన్నారు. శనివారం ఆమె పెన్‌పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, నెలవారీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రస్తుతం ఎన్ని టీబీ, కుష్టు వ్యాధి కేసులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది అందరూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తూ గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలన్నారు.
ప్రతి మంగళవారం వృద్ధుల సంరక్షణ శిబిరాలు నిర్వహించడంతో పాటు, పాలియేటివ్ కేర్ రోగుల ఇళ్లకు వెళ్లి చికిత్స అందించాలన్నారు. టీబీ, కుష్టు వ్యాధి కేసులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలల సందర్శనలు విధిగా చేపట్టాలన్నారు. యూ-విన్ (U-WIN), ఐడీఎస్పీ, ఐఎఫ్ఏ, హెచ్బీఎన్సీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. హెచ్ఎంఐఎస్, ఆమ్ (AAM) పోర్టల్ గణాంకాలు సరిపోయేలా చూసుకోవాలని సూచించారు. టీ-హబ్‌కు పంపే నమూనాలలో ఏమాత్రం రిజెక్షన్లు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సైదమ్మ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Maths | కొందరు పిల్లలు చిన్నతనం నుంచే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు, కొందరు ఉండరు.. ఎందుకు..?
Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

