harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
harish Rao | రేవంత్ రెడ్డి మీ పాలన ఎట్లుందంటే ఇండస్ట్రీకి, ఐటీకి కనీసం ఒక సెక్రటరీని కూడా అపాయింట్ చేయని పరిపాలన.. మీ కాంగ్రెస్ పాలన. ఇక మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతురని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
harish Rao | ఖైరతాబాద్‌లో మన పార్టీ మీద గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేసింది.. రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ సమయంలో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం ఖాళీ అవుతుందని అన్నారు.. ఇది బీఆర్ఎస్ గెలుపునకు ఒక గొప్ప సూచిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
సోమాజిగూడ డివిజన్ యువ నాయకుడు మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో త్రినాథ్‌తోపాటు పలువురు కార్యకర్తలు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ మధ్య రాష్ట్రంలో ఎవరూ సర్వే చేయించినా.. రేవంత్ రెడ్డి చేయించుకున్నా.. ఏజెన్సీలు చేసినా.. ఏ పార్టీ సర్వే చేసినా అన్ని సర్వేల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వస్తుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు.
ఇండస్ట్రీలను ఆకర్షిస్తా.. నేను భారత్ సమ్మిట్‌ను పెడతా అంటుండు రేవంత్ రెడ్డి.. అసలు ఈ రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమల కార్యదర్శే లేడు. ఐటీ శాఖకు సెక్రటరీనే లేడు.. నీ బొంద నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి.. ఐటీ డిపార్ట్మెంట్కు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి.. చీఫ్ సెక్రటరీని ఇన్చార్జ్గా పెట్టి నడిపిస్తున్నరు.. ఆ చీఫ్ సెక్రటరీకి సవాలక్ష పనులుంటాయి.. ఆయన ఏం టైం ఇవ్వగలుగుతడు.. ఆయన పరిశ్రమలకు, పారిశ్రామిక వేత్తలకు టైం ఇవ్వగలుగుతడా..? ఐటీ కంపెనీలకు టైం ఇవ్వగలుగుతడా..? మీ పాలన ఎట్లుందంటే ఇండస్ట్రీకి, ఐటీకి కనీసం ఒక సెక్రటరీని కూడా అపాయింట్ చేయని పరిపాలన.. మీ కాంగ్రెస్ పాలన. ఇక మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతురన్నారు.
ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం ఖాళీ అవుతుంది
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్వే చేయించుకున్నా, ఏజెన్సీలు సర్వే చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రిజల్ట్స్ వస్తున్నాయి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు https://t.co/8HGWZqK6VV
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2026
రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ పెట్టి ఇండస్ట్రీస్‌ను ఆకర్షిస్తానని చెబుతున్నాడు
అసలు ఈ రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమల కార్యదర్శి లేడు.. నీ బొంద, ఇంక నువ్వేం ఇండస్ట్రీస్‌ను ఆకర్షిస్తావు
– హరీష్ రావు https://t.co/d7G8Sqd0PO
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2026
Read Also :
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

